సైరాకు పనిచేయబోతున్న రాజమౌళి?

సైరాకు పనిచేయబోతున్న రాజమౌళి?
x
Highlights

ఆర్.ఆర్ ఆర్ మూవీతో బిజీగా వున్న రాజమౌళి సైరా సినిమాకు పని చేయబోతున్నాడ..? సైరా సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్షన్ చేస్తున్నాడు కదా.. అక్కడ రాజమౌళి ఏం...

ఆర్.ఆర్ ఆర్ మూవీతో బిజీగా వున్న రాజమౌళి సైరా సినిమాకు పని చేయబోతున్నాడ..? సైరా సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్షన్ చేస్తున్నాడు కదా.. అక్కడ రాజమౌళి ఏం చేస్తాడు..? అనే కదా మీ డౌట్ ఆ విషయం మీకు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి 151వ మూవీ సైరా సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే సినిమాలో చాలా వరకు గ్రాఫిక్స్, విజువల్ వండర్స్ ఉంటాయి. సైర నరసింహారెడ్డి చేసే యుధ్దాలు విజువల్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువగా కనిపించనున్నాయి. దీంతో చిరు రాజమౌళి సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. గ్రాఫిక్స్, విజువల్స్ అంటే రాజమౌళికి మించిన వాళ్లు లేరు ఇది అందరికీ తెలిసిన విషయమే దీంతో ఆయనను సైరాలో ఇన్వాల్వ్ చేయనున్నట్లు సమాచారం.

బాహుబలి పెద్ద హిట్ అయిందంటే దానికి కారణం అందులో గ్రాఫిక్స్ అందుకే చిరు రాజమౌళికి సినిమా చూపించి గ్రాఫిక్స్ ఎలా చేయించాలో సలహాలు తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది డైరెక్టర్లకు కూడా సినిమాను చూపించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు రాజమౌళికి కూడా సినిమా చూపించి ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందో తెలుసుకోబోతున్నారని తెలిసింది. దీని కోసం రాజమౌళి రాంచరణ్‌కు టైం కూడా ఇచ్చాడని ఫిలిమ్ నగర్ లో టాక్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories