logo
సినిమా

Naga Vamsi: ప్రభాస్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగ వంశీ

Producer Naga Vamsi Gave Clarity on the film With Prabhas
X

Naga Vamsi: ప్రభాస్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగ వంశీ

Highlights

Naga Vamsi: ప్రభాస్ తో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్

Naga Vamsi: అతి తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇండస్ట్రీ లో ప్రముఖ నిర్మాణ సంస్థ గా ఎదిగింది సితార ఎంటర్టైన్మెంట్స్. "జెర్సీ", "భీమ్లా నాయక్", "డీ జే టిల్లు", "భీష్మ", "ప్రేమమ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించి అందరి దృష్టిని ఆకర్షించింది సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. తాజాగా ఈ పతాకం నుండి నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అందులో భాగంగా మాట్లాడుతూ ప్రభాస్ తో ఎప్పటినుండో ఒక సినిమా అనుకుంటున్నాం కానీ కుదరడం లేదు అని అన్నారు నాగ వంశీ.

"మీ బ్యానర్ లో ఎంతో మంది స్టార్ హీరోలు నటించారు మరి ప్రభాస్ తో సినిమా ఎప్పుడు తీస్తారు," అని ఇంటర్వ్యూ లో అడగగా, "సాహో సినిమా తర్వాత నుండి ప్రభాస్ తో సినిమా కోసం ప్రయత్నిస్తున్నాము కానీ కుదరటం లేదు. ప్రభాస్ కి నాకు మధ్య ఉన్న కామన్ ఫ్రెండ్ నుంచి ప్రయత్నిస్తున్నాను కానీ ప్రభాస్ వద్ద చాలా కమిట్మెంట్లు ఉండడంతో సినిమా కుదరటం లేదు," అని స్పష్టం చేశారు సూర్యదేవర నాగవంశీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి హోం బ్యానర్ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ లో ప్రభాస్ సినిమా చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ కాంబోలో సినిమా ఎప్పటికీ కుదురుతుందో చూడాలి.

Web TitleProducer Naga Vamsi Gave Clarity on the film With Prabhas
Next Story