ప్రేక్షకులను మరింత ఇరిటేట్ చేస్తున్న "ఆది పురుష్" నిర్మాత కామెంట్లు

ప్రేక్షకులను మరింత ఇరిటేట్ చేస్తున్న "ఆది పురుష్" నిర్మాత కామెంట్లు

Rama Rao
Updated on: 10 Oct 2022 9:30 PM IST
Prabhas fans lash out at Producer NV Prasad for his comments
X

ప్రేక్షకులను మరింత ఇరిటేట్ చేస్తున్న "ఆది పురుష్" నిర్మాత కామెంట్లు

NV Prasad: ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ఆది పురుష్" సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర టీజర్ ఈ మధ్యనే విడుదల అయింది కాని అది ఏమాత్రం బాగోలేదని అభిమానులు సైతం మండిపడుతున్నారు. సినిమా విషయంలో ప్రేక్షకులు చాలావరకు అసంతృప్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత ఎన్ వీ ప్రసాద్ చేసిన కొన్ని కామెంట్లు ప్రేక్షకులను మరింత ఇరిటేట్ చేస్తున్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ" "మన దేశం మాత్రమే కాదు యావత్ ప్రపంచం ప్రపంచానికి శ్రీరాముడు ఎలా ఉంటాడు అని క్లారిటీ ఇచ్చినందుకు రాజమౌళి మరియు రామ్ చరణ్ కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి," అని అన్నారు ఎన్ వి ప్రసాద్. ఈ నేపథ్యంలో అసలే "ఆది పురుష్" సినిమా బాలేదని అభిమానులు విరుచుకుపడుతుంటే మరోవైపు ఎన్ వీ ప్రసాద్ ఇలాంటి కంపారిజన్లు చేస్తూ ఉండడం ఈ గొడవలకు మరింత ఆద్యం పోస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక మరోవైపు టీజర్ ఎలా ఉన్నా సినిమా మాత్రం చాలా బాగుంటుందని థియేటర్లలో విడుదల అయ్యేవరకు కొంత ఓపిక పట్టమని దర్శకనిర్మాతలు ప్రేక్షకులను కోరుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story