బడే మియా చోటే మియా కు షారుక్ స్టంట్ మాస్టర్.. భారీ యాక్షన్ ఎపసోడ్స్ పక్కా

Pathaan & Jawan famed international action director Craig Macrae was roped in for Bade Miyan Chote Miyan Action Sequences!
x

బడే మియా చోటే మియా కు షారుక్ స్టంట్ మాస్టర్.. భారీ యాక్షన్ ఎపసోడ్స్ పక్కా

Highlights

అక్షయ్ కుమార్ 'బడే మియా చోటే మియా' కు షారుక్ ఖాన్ స్టంట్ మాస్టర్  క్రైజి మక్రయ్ !!!

బడే మియాన్ చోటే మియాన్ సినిమాకు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను ప్రముఖ స్టంట్ కొరియోగ్రఫీర్ క్రైజి మక్రయ్ అందించారు. గతంలో క్రైజి మక్రయ్ షారుక్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేశారు. ఇప్పుడు బడే మియా చోటే మియాన్ సినిమాకు అదే స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ను కంపోజ్ చేశారు. ట్రైలర్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ఫైట్స్ చూస్తే క్రైజి మక్రయ్ వర్క్ కనిపిస్తుంది.

బడే మియా చోటే మియా చిత్ర ట్రైలర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. మార్చి 26న ఈ చిత్ర ట్రైలర్ ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి ఈ చిత్రం అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా రాబోతోంది. బడే మియా చోటే మియా చిత్రం కోసం ఇప్పటికే యాక్షన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్టన్ అవతారంలో హీరోయిన్లు మానుషీ చిల్లర్, ఆలయ ఫార్ట్యూన్ వాలా కనిపిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉత్కంఠని పెంచే కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, హై ఆక్టన్స్ యాక్షన్ సన్నివేశాలు అలరించబోతున్నాయి.

బడే మియా చోటే మియా ఇద్దరూ మీ హృదయాల్ని కొల్లగొట్టడమే కాదు.. సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే మూమెంట్స్ తో సిద్ధంగా ఉన్నారు. ఇది కేవలం చిత్రం కాదు.. రోలర్ కోస్టర్ రైడ్ లాగా థ్రిల్లింగ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఇలా ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో అవన్నీ అందించే విజువల్ వండర్. కాబట్టి ఆడియన్ మీ క్యాలెండర్ లో డేట్ సెట్ చేసుకుని సిద్ధంగా ఉండాలి.

వశు భగ్నానీ, పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఏఏజెడ్ ఫిలిమ్స్ సంస్థ అసోసియేషన్ లో ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి. అలీ అబ్బాస్ జాఫర్ రచన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వశు భగ్నానీ, దీప్షిక దేశముఖ్, జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంజాన్ కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, మానుషీ చిల్లర్, ఆలయ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories