ఎన్టీఆర్ 'కథానాయకుడు' కలెక్షన్స్

ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్
x
Highlights

దివంగత నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా కథానాయకుడు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి...

దివంగత నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా కథానాయకుడు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సినిమా చూసి డైరెక్టర్ క్రిష్ కు అభినందనలు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ పాత్రను పోషించిన బాలకృష్ణ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక కథానాయకుడు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు 22 కోట్లు వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ తరువాత కొంచెం డల్ అయినా శనివారం నుంచి మళ్ళీ పుంజుకున్నట్టు తెలుస్తోంది. మూడు రోజుల్లో 50 కోట్ల మార్కును దాటినట్టు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ఆంధ్రాలో అత్యధికంగా గుంటూరులో రూ.2.14 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.63 లక్షలు, నెల్లూరులో రూ.56 లక్షలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories