logo
సినిమా

ఈ నెలలోనే లాంచ్ అవ్వనున్న నితిన్ సినిమా

ఈ నెలలోనే లాంచ్ అవ్వనున్న నితిన్ సినిమా
X
Highlights

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న యువ హీరో నితిన్ తన ఆశలన్నీ 'చలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న ...

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న యువ హీరో నితిన్ తన ఆశలన్నీ 'చలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాపైనే పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు 'భీష్మ' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. 'సింగల్ ఫరెవర్' అనేది సినిమా ట్యాగ్ లైన్. నితిన్ మార్కెట్ పడిపోయినప్పటికీ తెలుగులో తనను పరిచయం చేసిన దర్శకుడు కాబట్టి వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒప్పుకుంది హప్పెనింగ్ బ్యూటీ రష్మిక మందన్న.

నితిన్ సరసన 'భీష్మ' సినిమాలో రష్మిక మందన్న నటించనుంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ గత ఏడాది సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ సినిమా లాంచ్ వాయిదాపడుతూ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఫిబ్రవరి 25 వ తారీఖున లాంచ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. 'చలో' కి సంగీతాన్ని అందించిన సాగర్ మహతి ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మరి నితిన్ ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి.

Next Story