Nithiin: నితిన్ చెప్పబోతున్న గుడ్ న్యూస్ ఏంటో తెలుసా?

Nithiin: తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది

Rama Rao
Updated on: 26 Oct 2022 8:15 PM IST
Nithiin is going to give good news to his fans soon
X

నితిన్ చెప్పబోతున్న గుడ్ న్యూస్ ఏంటో తెలుసా?

Nithiin: యువ హీరో నితిన్ తన కరియర్ లో ఎన్నో ఒడిదుడుకులను చూశాడు. వరుస డిజాస్టర్లు పడినప్పటికీ ఏదో ఒక విధంగా మళ్లీ ఒక మంచి సూపర్ హిట్ తో కం బ్యాక్ ఇస్తూ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు నితిన్. ఈ మధ్యనే చెక్, రంగ్ దే వంటి సినిమాలతో డిజాస్టర్లు అందుకున్న నితిన్ "మాచర్ల నియోజకవర్గం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

కానీ ఆ సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఇక నితిన్ తన ఆశలన్నీ తదుపరి సినిమా పైన పెట్టుకున్నాడు. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే 2020 జూలై 26న కరోనా టైంలో నితిన్ ఎంతో కాలంగా ప్రేమిస్తున్న శాలిని ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ మధ్యనే వీరి పెళ్లి అయ్యి రెండేళ్లు పూర్తయింది. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం నితిన్ త్వరలోనే తన అభిమానులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడని, తాను త్వరలోనే తండ్రి కాబోతున్నానని నితిన్ ప్రకటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నితిన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా అభిమానులు ఎదురు చూడాల్సి ఉంది. ఇక సినిమాల పరంగా చూస్తే నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story