మెగాస్టార్ మే డే కానుక.. భోళా శంకర్ లో చిరు రోల్ ఎలా ఉంటుందంటే...?

New Posters Release From Megastar Bhola Shankar
x

మెగాస్టార్ మే డే కానుక.. భోళా శంకర్ లో చిరు రోల్ ఎలా ఉంటుందంటే...

Highlights

Bhola Shankar: మే డే సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ లో చిరు..కార్మికుడి కాస్ట్యూమ్స్ లో చేతిలో టీ గ్లాసు పట్టుకొని ఉన్న మూడు స్టిల్స్ ని రివీల్ చేశారు.

Bhola Shankar: మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా బాక్సాఫీస్ ముందుకొచ్చి భారీ హిట్ అందుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ విడుదలైన మొదటి రోజు మొదటి షోకే బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. సినిమాలో చిరు వింటేజ్ లుక్ ని చూసి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ అభిమానులు సైతం సంబరాలు చేసుకున్నారు.

వాల్తేరు వీరయ్యతో డిస్ట్రిబ్యూటర్లకు 50 కోట్ల రూపాయల వరకు లాభాలు రాగా ఈ సినిమా ఇచ్చిన జోష్ తో చిరు ప్రస్తుతం భోళా శంకర్ సినిమాని రెడీ చేసుకుంటున్నాడు. స్టైలిష్ సినీ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తమిళ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే..మహానటి ఫేం కీర్తి సురేష్...చిరంజీవి చెల్లెలు పాత్రలో కనిపించనుంది.

భోళా శంకర్ మూవీని ఆగస్ట్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ అనుకున్న విధంగా సాగడం లేదని..మెహర్ రమేష్ పలు సీన్స్ ని మళ్లీ రీషూట్ చేయిస్తున్నాడని..దీంతో భోళా శంకర్ ఆగస్ట్ 11న రావడం కష్టమేనంటూ సోషల్ మీడియాలో పలు రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. భోళా శంకర్ రిలీజ్ విషయమై మెగా ఫ్యాన్స్ కాస్త కలవరపడుతున్న వేళ..మేకర్స్ ఆ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేస్తూ మే డే ను పురస్కరించుకొని స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

మే డే సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ లో చిరు..కార్మికుడి కాస్ట్యూమ్స్ లో చేతిలో టీ గ్లాసు పట్టుకొని ఉన్న మూడు స్టిల్స్ ని రివీల్ చేశారు. కారుతో పాటు ఉన్న ఈ మూడు స్టిల్స్ లో చిరు చాలా హ్యాండ్సమ్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. అంతేకాదు, చిరు స్టిల్స్ లో ఉన్న పోస్టర్ లో భోళా శంకర్ రిలీజ్ డేట్ ను మరోసారి కన్ ఫామ్ చేశారు. ఆగస్ట్ 11న వస్తున్నామంటూ నిర్మాతలు కన్ ఫర్మేషన్ ఇచ్చేశారు. మొత్తానికి, భోళా శంకర్ చిత్రంలో మెగా స్టార్ కార్ డ్రైవర్ గా కనిపించనున్నాడు.

భోళా శంకర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. దర్శకుడు మెహర్ రమేష్ భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చిరు, షావర్ అలీతో పాటు పలువురు ఫైటర్లు పాల్గొంటున్నారు. అలాగే ఈ మూవీ డబ్బింగ్ కార్యక్రమాలను సైతం ప్రారంభించారు. చిత్రీకరణను జూన్ నాటికి పూర్తి చేసేలా మేకర్స్ ఏర్పాట్లు చేసుకున్నారు. మొత్తానికి, మే డే కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్ లో చిరు స్టైలిష్ మాస్ లుక్ లో దర్శనం ఇవ్వడమే కాకుండా ఆగస్ట్ 11న వచ్చేస్తున్నట్లు కన్ ఫామ్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories