logo
సినిమా

10 నెలల పాటు హీరోలను బుక్ చేసుకున్నాడు

RRR
X
RRR
Highlights

'బాహుబలి' సినిమా సక్సెస్ తరువాత ప్రపంచం మొత్తం గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో బిజీగా ఉన్నాడు.

'బాహుబలి' సినిమా సక్సెస్ తరువాత ప్రపంచం మొత్తం గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా టాలీవుడ్ లోనే అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాకు తెరతీశారు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ డిసెంబర్ లోనే పూర్తయింది. ఇక రెండవ షెడ్యూల్ ఈ నెల 21వ తేదీ నుండి మొదలు కానుంది. ఈ మల్టీ స్టారర్ సినిమాతో 'బాహుబలి' రికార్డులను మళ్లీ తనే బద్దలు కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న.

ఇక రాజమౌళి సినిమా అంటే షూటింగ్ అంత త్వరగా పూర్తి అవ్వదు అని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. 'బాహుబలి' రెండు భాగాలను ఐదేళ్లపాటు తీసిన రాజమౌళి, 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం 10 నెలలు కేటాయించనున్నట్లు సమాచారం. అందుకే ఇద్దరు స్టార్ హీరోలను పది నెలల పాటు బుక్ చేసుకున్నాడు రాజమౌళి.ఈ పది నెలలలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మరొక సినిమాను మొదలు పెట్టడానికి లేదు.రాజమౌళి సినిమా ఒక కొలిక్కి వచ్చాకే వీరిద్దరికి మరొక సినిమా మొదలు పెట్టే అవకాశం దక్కుతుందన్న మాట. డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Next Story