logo
సినిమా

మార్చి 1న కళ్యాణ్‌ రామ్‌ '118'

మార్చి 1న కళ్యాణ్‌ రామ్‌ 118
X
Highlights

నందమూరి నట వారసుడు కల్యాణ్ రామ్‌ క‌థానాయ‌కుడిగా ప్రస్తుతం తెరకెక్కుతోన్న స‌స్పెన్స్ థ్రిల్లర్ `118` షూటింగ్...

నందమూరి నట వారసుడు కల్యాణ్ రామ్‌ క‌థానాయ‌కుడిగా ప్రస్తుతం తెరకెక్కుతోన్న స‌స్పెన్స్ థ్రిల్లర్ `118` షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇందులో జై లవకుశ ఫెమ్ నివేదా థామస్‌, అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండేలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫ‌ర్ పనిచేసిన గుహ‌న్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 1న విడుదలకానుంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

కాగా గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టీజర్‌కీ మంచి రెస్పాన్స్ వచ్చింది. పదేళ్ల కిందట అతనొక్కడే సినిమాతో హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఆ తరువాత హిట్స్ ను ఇవ్వలేకపోయాడు. కానీ పటాస్‌ సినిమాతో బ్రేక్‌ వచ్చినట్టుగానే కనిపించినా తరువాత మళ్లీ కెరీర్ గాడి తప్పింది. ప్రస్తుతం చేస్తున్న `118` సినిమాపై కళ్యాణ్ రామ్ భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఇందులో కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్ లో కనిపించనుండంతో అభిమానుల్లో అంచానాలు రెట్టింపు అయ్యాయి.

Next Story