Namrata Shirodkar: సితార ఒక అన్ ప్లాన్డ్ బేబీ అంటున్న నమ్రత

* ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితం గురించి మహేష్ తో తన ప్రేమ గురించి పిల్లలు గురించి కొన్ని విషయాలను బయటపెట్టింది

R Tripura Malini
Published on: 18 Dec 2022 8:27 AM IST
Namrata Says Sitara Is An Unplanned Baby
X

సితార ఒక అన్ ప్లాన్డ్ బేబీ అంటున్న నమ్రత

Namrata Shirodkar: నటిగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నమ్రత శిరోద్కర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్లి చేసుకున్నాక సినిమాలకి దూరమైంది. తాజాగా ఇప్పుడు మహేష్ బాబు వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇటు పిల్లల్ని కూడా చూసుకుంటూ నమ్రత బిజీగా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి మహేష్ తో తన ప్రేమ కథ గురించి పిల్లలు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.

ఈ నేపథ్యంలో తన కూతురు సితార ఘట్టమనేని గురించి మాట్లాడుతూ నమ్రత చేసిన కామెంట్లు ఇప్పుడు అందరినీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సితార అన్ ప్లాన్డ్ బేబీ అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నమ్రత."సితార ఒక అన్ ప్లాన్డ్ బేబీ. మేము అసలు ప్లాన్ చేయలేదు. కానీ ఇప్పుడు తను లేకుండా నా జీవితాన్ని నేను ఊహించుకోలేను," అని చెప్పారు నమ్రత. ఇక గౌతమ్ ప్రీ మెచ్యూర్ బేబీగా పుట్టినప్పుడు తాము అనుభవించిన మనోవేదన గురించి కూడా చెప్పుకొచ్చింది నమ్రత.

ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ ఎపిసోడ్ విడుదల కాబోతోంది. ఇక సినిమాలు పరంగా చూసుకుంటే మహేష్ బాబు ఈ మధ్యనే" సర్కారు వారి పాట" సినిమాతో మంచి హేట్ అందుకున్నారు. త్వరలోనే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా సైన్ చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story