అందుకే కరణ్ జోహార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న నాగార్జున

Nagarjuna is trying to get Akkineni Akhil to Enter Bollywood
x

అందుకే కరణ్ జోహార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న నాగార్జున

Highlights

*అందుకే కరణ్ జోహార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న నాగార్జున

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈమధ్యనే "బ్రహ్మాస్త్ర" సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. రన్బీర్ కపూర్ మరియు ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నాగార్జున ఒక కీలక పాత్రలో కనిపించారు. టాలీవుడ్ మాత్రమే కాక బాలీవుడ్ ప్రేక్షకులను కూడా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు నాగార్జున. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ మీడియాతో బాగా ఇంటరాక్ట్ అయిన నాగార్జున ఈమధ్య మళ్ళీ ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీస్ వద్ద రెండు మూడుసార్లు కనిపించారు.

నిజానికి సినిమా విడుదల తర్వాత నటీనటులకు ప్రొడక్షన్ హౌస్ తో పెద్దగా సంబంధం ఉండదు. అయితే నాగార్జున ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీస్ చుట్టూ తిరగడానికి ఒక కారణం ఉందని అది తన తనయుడు అక్కినేని అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ గురించి అని తెలుస్తోంది. వరుసగా మూడు ఫ్లాపులను అందుకున్న అఖిల్ ఈ మధ్యనే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో పరవాలేదు అనిపించారు. తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో "ఏజెంట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. అయితే అఖిల్ బాలీవుడ్ లో ఎంట్రీ గురించి నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. నార్త్ ఇండియాలో కూడా క్రేజ్ తెచ్చుకుంటే అఖిల్ మార్కెట్ పెరుగుతుందని నాగార్జున ఈ ఆలోచన చేసినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories