Nagarjuna: వరుసగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టేసిన నాగార్జున

Nagarjuna: చేతినిండా కథలతో బిజీగా ఉన్నా నాగార్జున

Jyothi
Updated on: 8 Dec 2022 11:00 AM IST
Nagarjuna is Busy With a Handful of Stories
X

Nagarjuna: వరుసగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టేసిన నాగార్జున

Nagarjuna: "బంగార్రాజు" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అక్కినేని నాగార్జున ఈ మధ్యనే "ఘోస్ట్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆ సినిమాతో పర్వాలేదు అనిపించిన నాగార్జున ఇప్పుడు కొత్త సినిమాలపై దృష్టి పెట్టారు. సీనియర్ డైరెక్టర్లతో పాటు యువ డైరెక్టర్లతో కూడా పని చేయడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా "గాడ్ ఫాదర్" ఫేమ్ డైరెక్టర్ మోహన్ రాజా తో పాటు మరొక రచయిత చెప్పిన కథ గురించి కూడా నాగార్జున ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు "మనం" ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో కూడా నాగార్జున నటించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా డైలాగ్ రైటర్ ప్రసన్నకుమార్ కూడా నాగార్జునకి ఒక మంచి కథను చెప్పారట. ప్రసన్న కుమార్ ఒక పిరియాడికల్ డ్రామా కథను చెప్పారని అది నాగార్జునకి బాగా నచ్చిందని తెలుస్తోంది. మరి ఇన్ని కథలలో ఏ ప్రాజెక్ట్ ను ముందుగా నాగార్జున సెట్స్ పైకి తీసుకువెళ్తారో ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం కంటెంట్ బావుంటే తప్ప ప్రేక్షకులు కూడా సినిమా ని థియేటర్లలో చూడడానికి ఇష్టపడటం లేదు. కనీసం సినిమాలో ఏదో ఒక ఆకర్షించే పాయింట్ అయినా ఉండాలి. ఇది అర్థం చేసుకున్న నాగార్జున తన తదుపరి సినిమాలలో కూడా ప్రేక్షకులను థియేటర్లు దాకా తీసుకురాగలిగే ఒక మంచి ఎలిమెంట్ ఉన్న సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ దిశలోనే కథలు కూడా వింటున్నారని సమాచారం. మరి నాగార్జున తన తదుపరి సినిమాలతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారో వేచి చూడాలి.

Jyothi

Jyothi

Next Story