జెర్సీని క్రాస్ చేసిన గ్యాంగ్ లీడర్

జెర్సీని క్రాస్ చేసిన గ్యాంగ్ లీడర్
x
Highlights

నేచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ వద్ద తలెత్తుకు నిలబడింది. విడుదలైన వెంటనే డివైడ్ టాక్ వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మాత్రం కొత్తదనం ఉన్న సినిమాగా టాక్ వెళ్ళింది. దీంతో శుక్రవారం విడుదలైన ఈ సినిమా బుకింగ్ ల వద్ద గట్టిగా నిలబడింది.

నేచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ వద్ద తలెత్తుకు నిలబడింది. విడుదలైన వెంటనే డివైడ్ టాక్ వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మాత్రం కొత్తదనం ఉన్న సినిమాగా టాక్ వెళ్ళింది. దీంతో శుక్రవారం విడుదలైన ఈ సినిమా బుకింగ్ ల వద్ద గట్టిగా నిలబడింది. నానీ కామెడీ టైమింగ్, కొత్తదనం, అనిరుద్ మ్యూజిక్ మ్యాజిక్ ఇంకో సినిమా సరైంది లేకపోవడం నానీ గ్యాంగ్ లీడర్ కి బాగా కలిసొచ్చిన అంశాలుగా చెప్పవచ్చు.

నానీస్ గ్యాంగ్ లీడర్ మొదటి వారాంతంలోనే మంచి కలెక్షన్స్ సాధించింది. డొమెస్టిక్ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా నాని క్రేజ్ వర్క్ అవుట్ అయ్యింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడు రోజులకే పెట్టినపెట్టుబడిలో సగం పైగా రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నానీ గత సినిమా జెర్సీ కలెక్షన్లని ఈ కలెక్షన్లు దాటినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సినిమా సేఫ్ జోన్ లో ఉన్నట్టేనని వారంటున్నారు. ఇక ఈ శుక్రవారం వాల్మీకి వచ్చే వరకు నాని సినిమాకి అడ్డులేదు. అయితే, వాల్మీకి ఫుల్ మాస్ మూవీ అని ఆ టీమ్ మెంబర్స్ చెబుతుండడం తో వాల్మీకి గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ ని ప్రభావితం చేసే అవకాశం ఉండకపోవచ్చు.

టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. మొదటి వారాంతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.84 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది నానీస్ గ్యాంగ్ లీడర్. జెర్సీ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌కి దీనికి పోల్చి చూస్తే ఈ సినిమా కోటిరూపాయల పైగా మార్జిన్‌తో ముందు నిలిచింది. ఇక ఓవర్సీస్‌లో కూడా నానికి కి ఉన్న ఫ్యాన్ బేస్ ఈ సినిమాకి కలిసొచ్చింది. దాంతో ఈ సినిమా అక్కడ కూడా మొదటోమూడు రోజులకుగాను 7 లక్షల 25 వేల డాలర్స్ కలెక్ట్ చేసింది నానీస్ గ్యాంగ్ లీడర్. ఈ సినిమా నాని కెరీర్ లో బెస్ట్‌గ్రాసర్‌గా నిలిచే అవకాశం ఉంది.

ఏరియాలవారీగా నానీస్ గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్(షేర్స్) ఇలా ఉన్నాయి.. నైజాం 4.67, సీడెడ్ 1.48, ఉత్తరాంధ్ర 1. 57, గుంటూరు 1.09, తూర్పు గోదావరి 1.06, కృష్ణా 0.93, నెల్లూరు 0.36, పశ్చిమ గోదావరి 0.68.

A.P, తెలంగాణ మొత్తం మూడురోజులకు 11.84 కోట్లు, అదేవిధంగా ఓవర్సీస్ లో మూడురోజులకు 7.25 లక్షల డాలర్స్ రాబట్టింది గ్యాంగ్ లీడర్


Show Full Article
Print Article
More On
Next Story
More Stories