logo

మహేష్ సరసన రష్మిక

మహేష్ సరసన రష్మిక
Highlights

కెరీర్‌లో తన 25వ సినిమా 'మహర్షి'తో మంచి విజయాన్ని అందుకున్నారు మహేశ్‌బాబు. ఇక తన తర్వాతి సినిమాపై...

కెరీర్‌లో తన 25వ సినిమా 'మహర్షి'తో మంచి విజయాన్ని అందుకున్నారు మహేశ్‌బాబు. ఇక తన తర్వాతి సినిమాపై దృష్టిపెట్టారు. 'ఎఫ్‌ 2' ఫేమ్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ సుంకర ఓ సినిమా నిర్మిస్తారని తెలిసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజాహెగ్డే, రష్మికా మండన్నా పేర్లు మేజర్‌గా వినిపించాయి. అయితే ఇందులో రష్మికా మండన్నా ఫైనలైజ్‌ అయినట్లు తాజా సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. జూన్‌ సెకండ్‌ వీక్‌ నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుందని తెలిసింది. ఎక్కువగా వినోదాత్మకంగా సాగే ఈ సినిమా షూటింగ్‌ కోసం అనిల్‌ రావిపూడి కర్నూలు పరిసర ప్రాంతాల్లో లొకేషన్స్‌ను వెతికిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో విజయశాంతి, బండ్ల గణేశ్‌ కీలక పాత్రలు చేయనున్నారని, 'సరిలేరు నీకెవ్వరూ' అనే టైటిల్‌ అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.


లైవ్ టీవి


Share it
Top