మహర్షి వ్యవసాయం మొదలైంది!

మహర్షి వ్యవసాయం మొదలైంది!
x
Highlights

సినిమా చూసి చెడిపోతున్నారనే మాట మనం తరుచు ఉంటుంటాము. సినిమా అభిమానులు మాత్రం సినిమా చూసి చెడిపోవడం, బాగుపడడం అలాంటివేమీ వుండవు. సినిమా చూస్తాం ఎంజాయ్...

సినిమా చూసి చెడిపోతున్నారనే మాట మనం తరుచు ఉంటుంటాము. సినిమా అభిమానులు మాత్రం సినిమా చూసి చెడిపోవడం, బాగుపడడం అలాంటివేమీ వుండవు. సినిమా చూస్తాం ఎంజాయ్ చేస్తాం అని సమర్థించుకుంటుంటారు. ఒక్కోసారి ఏదన్నా నేరం జరిగినపుడు సినిమా ఫక్కీలో జరిగిందని అంటుంటారు. అయితే, అరుదుగా సినిమా తో మాకు ఈ మంచి జరిగింది అని చెప్పే సంఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా సమాజ సేవ విషయంలో సినిమాల్లో చూసిన తరువాత దానిని స్ఫూర్తిగా తీసుకుని ముందడుగు వేసేవాళ్ళు అపుడపుడు కనిపిస్తుంటారు. అప్పట్లో చిరంజీవి సినిమాలో రక్తదానం గురించి చెబితే ఎంతో మంది ఆ తర్వాత రక్తదానానికి ముందుకు వచ్చారు. ఆ మధ్య శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చేత ఉరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ ను ప్రచారం చేయించారు దర్శకుడు కొరటాల శివ దాంతో చాలా మంది సెలబ్రిటీలు పల్లెల్ని దత్తత తీసుకుని అభివృద్ధి పథం లో నిలిపారు. ఇపుడు తాజాగా ఆ సీన్ మరోసారి రిపీట్ అయింది. మహేష్ బాబు 25వ సినిమా మహర్షి. ఈ సినిమాలో వ్యవసాయం గురించి.. రైతు గురించి తమదైన శైలిలో చిత్రీకరించారు. వీకెండ్ వ్యవసాయం అనే కాన్సెప్టును పరిచయం చేశారు.

ఇపుడు సినిమా విడుదలై మూడు రోజులు కూడా కాకుండానే వీకెండ్ వ్యవసాయానికి స్పందన వస్తోంది. నెట్టింటిలో ఈ కాన్సెప్ట్ గురించిన చర్చ నడుస్తోంది.


ఈ సినిమా నుంచి స్ఫూర్తిపొంది ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి పొలంలోకి అడుగుపెట్టారు. 'రైతులకు సానుభూతి అవసరం లేదు. వారికి మన గౌరవం దక్కాలి. 'మహర్షి' సినిమా ఓ మంచి ఆలోచనను కలిగించింది. రైతుల కష్టాలను తెరపై నిజాయతీగా చూపించినందుకు మహేశ్‌, వంశీ, దిల్‌రాజును అభినందించాలి. నాకు వీకెండ్‌ వ్యవసాయం అన్న కాన్సెప్ట్‌ చాలా నచ్చింది. ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి' అని ట్వీట్‌ చేస్తూ పొలం దున్నుతున్న ఫొటోను పంచుకున్నారు.


దీనిని చూసి అమిత్‌ సజానే అనే నెటిజన్‌ కూడా స్ఫూర్తి పొందారు. పొలం పనులు చేస్తున్న ఫొటోను మహేశ్‌కు, 'మహర్షి' చిత్రబృందానికి ట్యాగ్‌ చేస్తూ.. 'పుడిమికి మనిషికి మధ్య ఉన్న గొప్ప అనుబంధమే వ్యవసాయం. 'మహర్షి' సినిమా నుంచి స్ఫూర్తిపొందాను' అని పేర్కొన్నారు.

'బ్లాక్‌బస్టర్‌ సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. కానీ వాటిలోని సందేశాన్ని ప్రేక్షకులు అర్థంచేసుకుని పాటించినప్పుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం. వీకెండ్‌ వ్యవసాయానికి మంచి స్పందన వస్తోంది. బంగారు భవిష్యత్తుకు ఇది గొప్ప ప్రారంభం. మన తరానికే కాదు భావితరాలకు కూడా. ఇంతటి గొప్ప బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నందుకు మధుర శ్రీధర్‌, అమిత్‌ సజానేలను అభినందించాలి' అని మహేష్ బాబు వారిని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories