ఆ ఫ్లాప్ సినిమా కన్నా మహర్షికి తక్కువ ఓపెనింగ్స్..!

ఆ ఫ్లాప్ సినిమా కన్నా మహర్షికి తక్కువ ఓపెనింగ్స్..!
x
Highlights

ప్రిన్స్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాణమైన ఈ చిత్రాన్ని 2 వేల 500 థియేటర్లలో...

ప్రిన్స్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాణమైన ఈ చిత్రాన్ని 2 వేల 500 థియేటర్లలో విడుదల చేశారు. మహేష్ బాబుతో పాటు పూజా హెగ్డే, అల్లరి నరేష్ నటించిన ఈ చిత్రంపై అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్ నెలకొంది. మొత్తానికి గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా విక్షించిన ప్రతిఒక్కరు మహేష్ బాబు నటనను ఓ రేంజ్‌లో ప్రశంసల వర్షం కురింపించారు. ఇక బాహుబలి-2, భరత్ అనే నేను సినిమాలను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌ చేసిన గ్రేట్ ఇండియన్ ఫిల్మ్స్ మహర్షి ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను రూ. 14 కోట్లకు దక్కించుకుంది. అటు అమెరికా వ్యాప్తంగా బుధవారం 2,500 ప్రీమియర్ షోలను వేశారు. ఇక అనుకున్న విధంగానే ఈ సినిమాకి భారీ లెవెల్ లో ఓపెనింగ్స్ లభించాయి.

కాగా కలెక్షన్లను గమనిస్తే మాత్రం మహర్షి చిత్రం మహేష్‌ నటించిన స్పైడర్, భరత్‌ అనే నేను చిత్రాల ఓవర్సీస్ ప్రీమియర్ కలెక్షన్లను దాటలేకపోయింది. మొదటిరోజే ఫ్లాప్‌ టాక్‌ను మూటగట్టుకున్న స్పైడర్‌కు అమెరికాలో ప్రీమియర్ల ద్వారా 10 లక్షల 5 వేల 630 డాలర్లు(రూ. 7 కోట్ల 2 లక్షల 91 వేలు) సాధించగా, భరత్ అనే నేను చిత్రానికి ఎనిమిది లక్షల డాలర్ల(రూ. 5 కోట్ల 59 లక్షల 8 వేలు) కలెక్షన్లు వచ్చాయి. ఇక మహర్షి విషయానికి వోస్తే అమెరికాలో ప్రీమియర్ల ద్వారా మహర్షికి కేవలం ఐదు లక్షల 11 వేల డాలర్లు(రూ. 3 కోట్ల 57 లక్షల 11 వేలు) మాత్రమే వచ్చాయి. మహర్షి సినిమాకి మొదటిరోజున అత్యధికంగా నిజాం ఏరియా లో 6.38 కోట్లు రాగా, నెల్లూరు లో కోటి రూపాయలు వసూళ్లు నమోదు చేసుకుంది. రెండు తెలుగురాష్ట్రాల్లో కలిపి 'మహర్షి' సినిమా 24.6 కోట్లు ఒక్క రోజులో వసూళ్లు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories