Top
logo

కల్కి వచ్చేస్తున్నాడు

కల్కి వచ్చేస్తున్నాడు
Highlights

టీజర్ తో అభిమానులను అలరించిన రాజశేఖర్ కల్కి సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ మధ్య రామోజీ ఫిలిం సిటీలో కొన్ని...

టీజర్ తో అభిమానులను అలరించిన రాజశేఖర్ కల్కి సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ మధ్య రామోజీ ఫిలిం సిటీలో కొన్ని సీన్లు షూటింగ్ చేశారు. దీంతో షూటింగ్ పార్ట్ పూర్తయిందని సినిమా వర్గాలు చెప్పాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 28న సినిమాని విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. స్కార్లెట్‌ విల్సన్‌పై తెరకెక్కించిన 'హార్న్‌ ఓకే ప్లీజ్‌' పాట మాస్‌కి నచ్చేసింది. శ్రవణ్‌ భరద్వాజ్‌ ఇచ్చిన స్వరాలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. నిర్మాత రాధామోహన్‌ ఈ చిత్ర హక్కుల్ని సొంతం చేసుకున్నార''న్నారు. ఆదాశర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, రాహుల్‌ రామకృష్ణ, నాజర్‌, అశుతోష్‌ రాణా తదితరులు నటించారు.

Next Story

లైవ్ టీవి


Share it