జెర్సీ సేఫ్!

జెర్సీ సేఫ్!
x
Highlights

నానీ.. తన కెరీర్ లోనే అద్భుతమైన సినిమా చేసాడని విమర్శకుల ప్రశంశలు అందుకున్న సినిమా జెర్సీ! ఈ సినిమా విడుదలైన దగ్గరనుంచీ అన్ని వైపులా నుంచి మంచి సినిమా...

నానీ.. తన కెరీర్ లోనే అద్భుతమైన సినిమా చేసాడని విమర్శకుల ప్రశంశలు అందుకున్న సినిమా జెర్సీ! ఈ సినిమా విడుదలైన దగ్గరనుంచీ అన్ని వైపులా నుంచి మంచి సినిమా అనే టాక్ వినిపించింది. అదే రోజూ విడుదలైన కాంచన 3 కి కాస్త అటూ ఇటూ గా ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే, మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అయిపోయింది. నానీ జెర్సీ తో పోలిస్తే కలెక్షన్లలో ముందుకు దూసుకుపోయింది. ఎంతో మంచి టాక్ వచ్చిన సినిమా కమర్షియల్ గా హిట్టా ఫట్టా అనే సందేహాలు వినిపించాయి జెర్సీ విషయం లో. కానీ, లాంగ్ రాన్ లో జెర్సీ మంచి కలెక్షన్లను రాబట్టి సేఫ్ పొజిషన్లో నిలబడింది. నిజానికి ఈ సినిమా కి వచ్చిన రెస్పాన్స్ కి సినిమా కలెక్షన్లూ ఓ రేంజ్ లో ఉంటాయనే ఊహించారందరూ. కానీ, కంటెంట్ కి మాస్ ప్రేక్షకులు కనెక్ట్ కాకపోవడం, మరోపక్క కంచన పూర్తి మాస్ మసాలా సినిమాగా నిలబడటం జెర్సీని తడబాటుకు గురిచేశాయి.

ఇపుడు 'జెర్సీ' సినిమాకి లాభాలు వచ్చాయా? నష్టాలు వచ్చాయా? అనేది అందరిలో సందేహాన్ని రేకెత్తిస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 27 కోట్లకు అమ్మారని తెలిసింది. ఫుల్ రన్లో ఈ సినిమా 35 కోట్ల షేర్ ను రాబట్టిందనేది తాజా సమాచారం. డీఎంతో అన్ని ఏరియాల్లో బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాను, హిట్ చిత్రంగా నిలిచినట్టయింది. మొత్తమ్మీద సినిమాలో కంటెంట్, ప్రశంసలే కాకుండా ఇంకా ఎదో కావాల్సి ఉందని నానీ జెర్సీ సందేశం ఇస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories