ప్రభాస్ ఇంటి ముందు జపాన్ ఫాన్స్ హంగామా

ప్రభాస్ ఇంటి ముందు జపాన్ ఫాన్స్ హంగామా
x
Highlights

ప్రభాస్ ఇపుడు అంతర్జాతీయంగా ఫేమస్. బాహుబలి సినిమా మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సొమ్ములతో పాటు ప్రేక్షకుల అభినందనల్నీ కొల్లగొట్టింది. జపాన్ లో ఈ...

ప్రభాస్ ఇపుడు అంతర్జాతీయంగా ఫేమస్. బాహుబలి సినిమా మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సొమ్ములతో పాటు ప్రేక్షకుల అభినందనల్నీ కొల్లగొట్టింది. జపాన్ లో ఈ సినిమా తో ప్రభాస్ కు ప్రత్యేకంగా అభిమానులు తయారయిపోయారు. బాహుబలి జపాన్ లో విడుదల చేసిన సందర్భనుగా యూనిట్ సభ్యులు అక్కడికి వెళ్లి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సినిమా సూపర్ హిట్ అయినా సందర్భంగానూ అక్కడికి వెళ్లారు. అలా బాహుబలితో ప్రభాస్ కు జపాన్ లో ఫన్ ఫాలోయింగ్ ఏర్పడిపోయింది. ఇపుడు జపాన్ నుంచి కొందరు అభిమానులు ప్రభాస్ ను చూడటానికి ఇక్కడికి వచ్చారు. వారంతా ప్రభాస్ ఇంటికి వెళ్లారు. ఆ తరువాత ప్రభాస్ ఇంటిముందు సందడి చేస్తూ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభాస్‌ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో ఈ సంఘటన తెలుపుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ప్రభాస్‌ ప్రస్తుతం 'సాహో' సినిమాలో నటిస్తున్నారు. సుజీత్‌ దర్శకుడు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఆగస్టు 15న చిత్రం విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories