ఏమాత్రం బజ్ లేని అఖిల్ సినిమా

*అందుకే "ఏజెంట్" బృందం సైలెంట్ గా ఉందా?

Jyothi
Published on: 28 Nov 2022 11:42 AM IST
Is that why the Agent team is silent?
X

ఏమాత్రం బజ్ లేని అఖిల్ సినిమా

Agent: అక్కినేని అఖిల్ ఇప్పటిదాకా ఒక్క చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ కూడా లేదు. వరుసగా మూడు డిజాస్టర్లు అందుకున్న అఖిల్ ఈ మధ్యనే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో పరవాలేదు అనిపించాడు. ఇక తాజాగా తన ఆశలన్నీ "ఏజెంట్" పైన పెట్టుకున్నాడు. "సైరా నరసింహారెడ్డి" ఫేమ్ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేసేయడంతో 2022లోనే సినిమా విడుదలవుతుందని అందరు అనుకున్నారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు.

కానీ ఇప్పుడు అది కూడా వర్కౌట్ అవటం లేదు. సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ కూడా బయటకు రావటం లేదు. అసలు సినిమా ఏమైపోయింది అంటూ అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. అప్పటికే సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వారసుడు తునివు సినిమాలు విడుదలవుతుండడంతో థియేటర్లు దొరకకపోవచ్చు అని ఏజెంట్ బృందం వెనకడుగు వేసినట్లు కొందరు చెబుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ఒకవేళ ముందుగా అనుకున్నట్టుగానే సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలంటే ప్రమోషన్లు ఇప్పటినుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. అలా జరగటం లేదు కాబట్టి సినిమా వేసవిలోనే విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story