వెస్టిండీస్ తో తొలి టెస్ట్: పట్టు బిగించిన టీమిండియా

వెస్టిండీస్ తో తొలి టెస్ట్: పట్టు బిగించిన టీమిండియా
x
Highlights

వెస్టిండీస్ తొ జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. ఇషాంత్ శర్మ తన భీకర బౌలింగ్ తొ విండీస్ వెన్ను విరిచాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 10 8 పరుగుఅల ఆధిక్యాన్ని సాధించింది.

రహానే, ఆల్రౌండర్ జడేజా అర్థ సెంచరీతో తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు వెస్టిండీస్ పై 297 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా పేసర్ ఇషాంత్ శర్మ పదునైన బంతులతొ విరుచుకు పడడంతో విండీస్ విలవిలలాడింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 59 ఓవర్లలో 189 పరుగులే చేసిన విండీస్‌ ఎనిమిది వికెట్లను కోల్పోయింది. విండీస్ పతనానికి ఇక రెండు వికెట్లు మాత్రమే మిగిలివున్న దశలో ప్రస్తుతం భారత్ జట్టు 108 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.

విండీస్‌ ఆటగాళ్లలో రోస్టన్‌ ఛేజ్‌(48), హెట్‌మెయిర్‌(35)లు ఇద్దరూ కొద్దిగా భారత్ బౌలర్లను అడ్డుకోగలిగారు. కానీ, మిగిలిన బ్యాట్స్ మెన్ వరుస కట్టారు. ఓపెనర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ను త్వరగా పెవిలియన్ కు చేర్చిన ఇషాంత్‌.. అటు తరువాత మరింత రెచ్చిపోయాడు. తరువాత రోస్టన్‌ ఛేజ్‌, షాయ్‌ హోప్‌, హెట్‌ మెయిర్‌ వికెట్లను సాధించి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు. రెండో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా కీమర్‌ రోచ్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఐదు వికెట్లను ఇషాంత్‌ సాధించాడు. టెస్టుల్లో ఇషాంత్‌ ఐదు వికెట్లను అందిపుచ్చుకోవడం ఇది తొమ్మిదోసారి. కాగా, వెస్టిండీస్‌ గడ్డపై ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లను(10 వికెట్లలోపు) మూడోసారి తీశాడు. అంతకుముందు భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (112 బంతుల్లో 58), రహానే (81; 10 ఫోర్లు)లు ఆదుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది.

తొలి టెస్ట్ స్కోరు కార్డు..

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) హోప్‌ (బి) చేజ్‌ 44; మయాంక్‌ (సి) హోప్‌ (బి) రోచ్‌ 5; పుజారా (సి) హోప్‌ (బి) రోచ్‌ 2; కోహ్లి (సి) బ్రూక్స్‌ (బి) గాబ్రియెల్‌ 9; రహానే (బి) గాబ్రియెల్‌ 81; విహారి (సి) హోప్‌ (బి) రోచ్‌ 32; పంత్‌ (సి) హోల్డర్‌ (బి) రోచ్‌ 24; జడేజా (సి) హోప్‌ (బి) హోల్డర్‌ 58; ఇషాంత్‌ (బి) గాబ్రియెల్‌ 19; షమీ (సి అండ్‌ బి) చేజ్‌ 0; బుమ్రా (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (96.4 ఓవర్లలో ఆలౌట్‌) 297.

వికెట్ల పతనం: 1–5, 2–7, 3–25, 4–93, 5–175, 6–189, 7–207, 8–267, 9–268, 10–297.

బౌలింగ్‌: రోచ్‌ 25–6–66–4; గాబ్రియెల్‌ 22–5–71–3; హోల్డర్‌ 20.4–11–36–1; కమిన్స్‌ 13–1–49–0; చేజ్‌ 16–3–58–2.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories