Top
logo

అవునా.. 'అనసూయ ప్రేమ' కోసం 'ఆది' అప్పట్నుంచి ప్రయత్నిస్తున్నాడా?

అవునా..
Highlights

అనసూయ కోసం ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమందితో పోటీ పడ్డాడట ఆది. అసలు ఈ ఆది ప్రేమ నిన్న మొన్నటిది కాదంట....

అనసూయ కోసం ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమందితో పోటీ పడ్డాడట ఆది. అసలు ఈ ఆది ప్రేమ నిన్న మొన్నటిది కాదంట. స్కూల్ లో చదువుతున్నప్పటినుంచి తూనీగా తూనీగా స్టైల్ ప్రేమట.. పాపం ఆది చేబుదామనుకునే లోగా అవాంతరాలు ఎదురై ఇద్దరూ దూరం అయిపోవడం.. అనసూయ పెళ్లి అయిపోవడం.. ఇద్దరు పిల్లల తల్లి అయిపోవడం జరిగిపోయిందట. ఏమిటి ఇదంతా.. సోది అనుకుంటున్నారా? ఇది అబద్ధం కావచ్చేమో కానీ సోది మాత్రం కాదు. గురువారం ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షోలో ఆది చెప్పిన విశేషాలు ఇవి. అందర్నీ కడుపుబ్బా నవ్వించిన ఈ స్కిట్లో ఆది పంచ్ లకు అనసూయ సిగ్గుల మొగ్గ అయిపొయింది.


నవ్వుల పువ్వులు పూయించిన ఈ స్కిట్లో ఆది అనసూయను '' మేమేమో కలల్లో తెలిపోతుంటే, నీవేమో పిల్లల్ని కనేశావా అనసూయా'' అని దేవదాసు గెటప్లో అమాయకంగా అడిగిన ఆది ప్రశ్నకి పడీ పడీ నవ్వడం ప్రేక్షకుల వంతైతే, మొహం చేతుల్లో కప్పుకుని సిగ్గుపడుతూ నవ్వుకోవడం అనసూయ వంతైంది. అనసూయ నీకేం కావాలన్నా తెచ్చేస్తాను అంటూ పులిహోర కలుపుతూ అనసూయ క్యారెక్టర్ చేసిన ఆమెని అంటాడు ఆది. ఆడికి శాకిస్తూ టీవీలో సుమక్క ప్రోగ్రాం వస్తుంది నేను యాంకరింగ్ నేర్చుకోవాలి అని వెళ్ళిపోతుంది. దీంతో దేవదాసు అయిపోతాడు ఆది. ఈలోపు అక్కడికి మరో పదిమంది దాకా దేవదాసులు వస్తారు. మీరంతా ఎవర్రా అని ఆది అడిగితే..అనసూయ కోసం ఇలా అయిపోయాం అంటారు అంతా ఇంతలో అనసూయ ఫ్యామిలీతో ఎంట్రీ ఇస్తుంది. దీంతో అనసూయా మేము నీ దర్శనం కోసం ఎదురుచూస్తుంటే.. ఎదో తిరపతి దర్శనానికి వెళుతున్నట్టు ఫ్యామిలీ..పిల్లలతో ఎంట్రీ ఇచ్చావేంటి? అంటాడు ఆది. ఈలోపు అనసూయ భర్త భరద్వాజ్ గా చేసిన వ్య్తక్తి అనసూయ ఇక్కదేమిటి వీళ్ళంతా ఇక్కడ మందు తాగుతూ న్యూసెన్స్ అంటాడు. దానికి అనసూయ ఒకప్పుడు వీళ్ళంతా నన్ను ప్రేమించిన వాళ్లు అని చెబుతుంది. ఓహో నీతో పెళ్లి తప్పిపోయినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారా? అంటాడు అతను. దీంతో అనసూయ షాక్ అవుతంది. చిన్నప్పట్నుంచి నీకోసం ఇంగ్లీష్ చదవడం మానేశాను తెలుసా అని అనసోయతో ఆది అంటాడు. ఎందుకు అని అడిగితె.. తెలుగులో అ అంటే అనసూయ అని.. ఆ అంటే ఆది అని వస్తుంది. ఇంగ్లీషులో ఎ అంటే అనసూయ బి అంటే భరద్వాజ అని వస్తోంది అందుకే అంటాడు ఆది.

ఇలా అనసూయ చిన్న తనానికి తన ప్రేమ కథను జోడించి ఆది వదిలిన స్కిట్ నవ్వుల నజరానా ఇచ్చింది. ఇక ఈ ఎపిసోడ్లో మరో హైలైట్ స్కిట్ ఏమిటంటే రాకెట్ రాఘవది.

ఏపనీ లేని రాఘవ ఒక దొంగ దగ్గర పనికి చేరతాడు. దొంగతనం ఎలా చేయాలో నేర్చుకోవడమే అతని పని. ఇక దొంగ గా చేసిన నాగి రాఘవతో పడే పాట్లు కడుపుబ్బా నవ్వించాయి. దొంగతనం చేయడానికి ఒక ఇంటి వద్దకు వెళ్ళిన నాగి ఆ ఇంటి తాళాలు తెరవడానికి ప్రయత్నిస్తూ.. రాఘవను పక్కన నిలబదమంటాడు. ఇక రాఘవ మొదలెడతాడు.. టైం పాస్ కావట్లేదంటూ కొత్త జాబ్ లో చేరాను ఎలా ఉందొ చూడండి అంటూ ఫేస్ బుక్ లో లైవ్ పెడతాడు. దీంతో నాగి అడ్డంగా బుక్కైపోతాడు. ఈ క్రమంలో అద్భుతమైన హాస్యాన్ని పండించారు. ఇక మిగిలిన స్కిట్ లు కూడా మంచి హాస్యాన్ని పంచాయి.

మొత్తమ్మీద జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ నవ్వుల పువ్వులు పూయించింది.
Web Titlehyper adi love episode with anchor anasuya in Jabardasth latest episode entertains the audience
Next Story


లైవ్ టీవి