Ram Pothineni: మళ్లీ అదే తప్పు చేస్తున్న హీరో రామ్

Ram Pothineni: రామ్ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటున్న ఫ్యాన్స్

Jyothi
Published on: 17 Sept 2022 2:04 PM IST
Hero Ram Making the Same Mistake Again
X

Ram Pothineni: మళ్లీ అదే తప్పు చేస్తున్న హీరో రామ్

Ram Pothineni: ఒకవైపు పరభాషలో నటినటులందరూ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే మరొకవైపు యువ హీరో రామ్ పోతినేని మాత్రం పర భాషా డైరెక్టర్లతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా "ది వారియర్" అనే సినిమాలో నటించారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో హిట్టందుకున్న రామ్ ఈ సినిమాతో మాత్రం మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరొక సినిమాకి సైన్ చేశారు రామ్.

కానీ చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నాడు అంటూ రామ్ అభిమానులు మాత్రం కంగారు పడుతున్నారు. ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన "ది వారియర్" ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఒక తెలుగు డైరెక్టర్ తో సినిమా చేయకుండా మళ్ళీ తమిళ్ డైరెక్టర్ తోనే సినిమా సైన్ చేయటంతో అభిమానులు కూడా నిరాశ చెపుతున్నారు. మరోవైపు బోయపాటి శ్రీను డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. బోయపాటి రామ్ సినిమాతో మాత్రం ఎలాగైనా హిట్ అందుకోవాలని మంచి పట్టుదలతో ఉన్నారు. మరి వీరిద్దరి సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Jyothi

Jyothi

Next Story