దిల్ రాజు ఎప్పుడంటే అప్పుడే అంటున్న గుణ శేఖర్

Gunasekhar Completely left the matter of Shaakuntalam Movie to Dil Raju
x

దిల్ రాజు ఎప్పుడంటే అప్పుడే అంటున్న గుణ శేఖర్

Highlights

దిల్ రాజు ఎప్పుడంటే అప్పుడే అంటున్న గుణ శేఖర్

Gunasekhar: స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ "శాకుంతం" నవల ఆధారంగా అదే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. శాకుంతల మరియు దుశ్యంతుడి ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ డ్రామాగా "శాకుంతలం" తెరకెక్కనుంది. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు దుర్వాస మహర్షిగా ప్రకాష్ రాజ్ కన్వరిషిగా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణ శేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మించారు.

ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది కానీ గ్రాఫిక్స్ వర్క్ ఇంకా జరుగుతోంది. నీలిమ గుణ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి బ్యాక్ సపోర్టర్ గా దిల్ రాజు వున్నారు. ఆయనే ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసే హక్కుల్ని దిల్ రాజు ముందే సొంతం చేసుకున్నారు. దీంతో 'శాకుంతలం' రిలీజ్ డేట్ ఆయన చేతుల్లోనే ఉంది అని తెలుస్తోంది. ఆయన ఎప్పుడంటే అప్పుడే రిలీజ్ అని గుణశేఖర్ అంటున్నారట.

ఇదిలా ఉండగా సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. జనవరిలో రిలీజ్ అంటే సంక్రాంతి కి భారీ సినిమాల పోటీ వుంది. అంతే కాకుండా ఆ టైమ్ లో దిల్ రాజు నిర్మిస్తున్న 'వారసుడు' కూడా రిలీజ్ కాబోతోంది. కాబట్టి దిల్ రాజు 'శాకుంతలం' ను డిసెంబర్ కే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. గుణశేఖర్ కూడా దిల్ రాజు నిర్ణయానికే ఓకే అంటున్నారట. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories