Faria Abdullah: చాలా నెమ్మదిగా సాగుతున్న ఫరియా అబ్దుల్లా కరియర్

Faria Abdullah: చాలా నెమ్మదిగా సాగుతున్న ఫరియా అబ్దుల్లా కరియర్

Rama Rao
Updated on: 4 Nov 2022 8:30 PM IST
Faria Abdullahs Career in the Film Industry is Moving Very Slowly | Tollywood News
X

Faria Abdullah: చాలా నెమ్మదిగా సాగుతున్న ఫరియా అబ్దుల్లా కరియర్

Faria Abdullah: జాతి రత్నాలు సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది ఫరియా అబ్దుల్లా. తన అందం, అభినయంతో మాత్రమే కాకుండా కామెడి టైమింగ్ తో కూడా ఈమె ప్రేక్షకులను బాగానే అలరించింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈమె గ్లామర్ విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం పాత్ర డిమాండ్ చేస్తే మాత్రం గ్లామర్ ఎలాంటి ఎంత గ్లామరస్ రోల్ అయినా చేయడానికి రెడీ అంటోంది ఫరియా.

నిజానికి జాతి రత్నాలు సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఆమెకి అవకాశాలు అంతగా రాలేదు దానికి కారణం ఆమె హైట్ కి తగ్గ హీరో దొరకకపోవడం. గతంలో అనుష్క కూడా ఇదే ఇబ్బందులు ఎదుర్కొంది. తాజాగా ఇప్పుడు ఫరియా కూడా అదే జాబితాలో చేరింది. దాదాపు చాలామంది స్టార్ హీరోలు తక్కువ హైట్ ఉంటారు. దీంతో ఫరియాతో సినిమా అంటే ఎవరైనా చాలామంది హీరోలు వెనకడుగు వేస్తున్నారు.

అయితే తొందరపడకుండా టైం పట్టిన పర్లేదు కానీ మంచి సినిమాలు మాత్రమే ఎంచుకోవాలని నిర్ణయించుకున్న ఫరియా సంతోష్ శోభన్ హీరోగా నటించిన "లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్" సినిమా తో మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. మరోవైపు విజయ్ ఆంటోనీ నటిస్తున్న తమిళ్ సినిమాలో కూడా సరిగా హీరోయిన్ గా కనిపించనుంది ఫరియా. కన్నడ నుంచి ఈమెకు కూడా ఒక మంచి ఆఫర్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన మాత్రం ఇంకా వెలుపడాల్సి ఉంది.

Rama Rao

Rama Rao

Next Story