Superstar Krishna: కృష్ణకు నివాళులర్పించేందుకు పద్మాలయ స్టూడియోకు వచ్చిన అభిమానులు

Superstar Krishna: సుదూర ప్రాంతాల నుంచే కాక.. వేరే రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు

Jyothi
Published on: 16 Nov 2022 1:09 PM IST
Fans Came to Padmalaya Studio to Pay Tribute to Superstar Krishna
X

Superstar Krishna: కృష్ణకు నివాళులర్పించేందుకు పద్మాలయ స్టూడియోకు వచ్చిన అభిమానులు

Superstar Krishna: కృష్ణ మృతి చెందాడనే వార్త తెలిసి.. అభిమాన హీరో కడసారి చూపు కోసం అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. కిలోమీటర్ల మేర క్యూలో నిల్చున్నారు. సుదూర ప్రాంతాల నుంచే కాక.. వేరే రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కృష్ణ మరణించారనే వార్త తెలియగానే.. చాలా మంది.. ఆయన కడసారి చూపు కోసం వచ్చారు. కృష్ణ మృతి నేపథ్యంలో సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. పద్మాలయ స్టూడియో దగ్గర అభిమానుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అభిమాన హీరో కడచూపు కోసం పెద్దఎత్తున అభిమానులు పద్మాలయ స్టూడియోకు తరలివచ్చారు. బారికేడ్లు తోసుకుని లోపలకు వెళ్లేందుకు ఫ్యాన్స్ యత్నించారు. పెద్ద ఎత్తున కృష్ణ అభిమానులు తరలిరావడంతో పోలీసులు నిలువరించలేని పరిస్థితి నెలకొంది.

Jyothi

Jyothi

Next Story