Hansika Motwani : ఈఫిల్ టవర్ ముందు హన్సికకు పెళ్లి ప్రపోజల్.. ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో తెలుసా?

* బిజినెస్ పార్టనర్ లుగా మొదలైన వారి బంధం ఇప్పుడు పెళ్లి పీటల దాకా వెళుతోంది

R Tripura Malini
Published on: 2 Nov 2022 1:20 PM IST
everything you need to know about the man hansika is going to marry
X

Hansika Motwani : ఈఫిల్ టవర్ ముందు హన్సికకు పెళ్లి ప్రపోజల్.. ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో తెలుసా?

Wedding Bells: ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ హన్సిక మోత్వాని ఇప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడానికి సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం హన్సిక కుటుంబ సభ్యులు ఆమె పెళ్లి కోసం రాజస్థాన్లోని మండోటా ఫోర్ట్ మరియు జైపూర్ ప్యాలెస్ లను బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ హన్సిక మోత్వాని పెళ్లి చేసుకోబోతోంది ఎవర్ని అనే విషయమై చాలామందికి తెలియదు.

వివరాల్లోకి వెళితే 2020లో హన్సిక మోత్వాన్ని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మొదలుపెట్టింది. ఎన్నో పెళ్లిళ్లు, సెలబ్రేషన్స్ మరియు ఈవెంట్స్ కూడా చేసేవాళ్లు. హన్సిక మోత్వానీ పార్ట్నర్ పేరు సోహెల్ కతురియా. అతనే ఇప్పుడు హన్సిక ను పెళ్లి చేసుకోబోతోంది. బిజినెస్ పార్టనర్ లుగా మొదలైన వారి బంధం ఇప్పుడు పెళ్లి పీటల దాకా వెళుతోంది. ఇక ఈ మధ్యకాలంలో హన్సికకి పెద్దగా ఆఫర్లు కూడా రావడం లేదు.

ఈ నేపథ్యంలోనే హన్సిక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇకపోతే హన్సిక కూడా ఈ విషయాన్నీ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో అధికారికంగా పోస్ట్ చేసింది. అయితే హన్సిక పెళ్లి ఈ ఏడాది డిసెంబర్ 4వ తేదీన జరగబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి, కానీ ఈ విషయం పై హన్సిక ఇంకా ప్రకటన ఇవ్వాల్సి ఉంది. గతంలో శింబు తో హన్సిక పెళ్లిదాకా వెళ్ళింది కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు విడిపోయారు.


R Tripura Malini

R Tripura Malini

Next Story