logo

యూత్ ఎంటర్టైనర్ గా యురేకా

యూత్ ఎంటర్టైనర్ గా యురేకా
Highlights

లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ నిర్మస్తున్న యురేకా చిత్రం టీజర్ శుక్రవారం విడుదల చేశారు. టీజర్...

లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ నిర్మస్తున్న యురేకా చిత్రం టీజర్ శుక్రవారం విడుదల చేశారు. టీజర్ కు మంచి స్పందన వస్తున్నట్టు సినిమా దర్శకుడు కార్తీక్ తెలిపారు. ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో యురేకా రూపొందుతోందని ఆయన చెప్పారు. టీజర్ కు వస్తున్న స్పందన చాలా సంతోషాన్ని కలిగిస్తోందని సెప్పిన కార్తీక్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయన్నారు. ఆ అంచనాలకు ఏ ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందనితెలిపారు. నిర్మాత ప్రశాంత్ మాట్లాడుతూ సినిమా అద్భుతంగా తెరకెక్కుతోందన్నారు. ఎక్కడా రాజి పడకుండా సినిమాని నిర్మిస్తన్నామని చెప్పారు. సినిమా యూనిట్ అంతాసినిమా బాగా రావడం కోసం చాలా ష్టపడుతున్నారన్నారు. ఆ కష్టం సినిమాలో కనబడుతుందని వారందరికీ ధన్యవాదములు తెలిపారు.

త్వరలోనే థీరియాట్రికల్ ట్రైలర్ ను విడుదల చేస్తామని చెప్పారు. సినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది, త్వరలోనే విడుదల తేదీని తెలియచేస్తాం, అని వివరించారు. కార్తీక్ ఆనంద్, శాలిని, మున్నా, డింపుల్ హయతి యురేకా సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా లవ్-యాక్షన్-ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.


లైవ్ టీవి


Share it
Top