ప్రభాస్ సినిమాలో మూడవ హీరోయిన్ ఎవరో తెలుసా..?

*ప్రభాస్ కోసం మూడో హీరోయిన్ ను కూడా సెట్ చేసిన మారుతీ

Jyothi
Published on: 26 Nov 2022 12:13 PM IST
Do you Know Who is the Third Heroine in Prabhas movie?
X

ప్రభాస్ సినిమాలో మూడవ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్లో త్వరలోనే ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు వరుస ప్యాన్ ఇండియన్ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ మరోవైపు మారుతి సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలుపెట్టనున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే సినిమా నెక్స్ట్ షెడ్యూల్ మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మూడవ హీరోయిన్ని రంగంలోకి దింపనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రిద్ధి కుమార్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన మూడవ హీరోయిన్ గా నటించేందుకు సైన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

హారర్ కామెడీ సినిమా గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ మరియు నిధి అగర్వాల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు రిద్ధి కుమార్ కూడా ఈ సినిమాలో భాగం కాబోతోంది. రిద్ధి కుమార్ గతంలో ప్రభాస్ నటించిన "రాధే శ్యామ్" సినిమాలో కూడా స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండే ఒక అమ్మాయి పాత్రలో కనిపించింది. తాజాగా ఇప్పుడు ఆమె ప్రభాస్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో విడుదల అవుతుందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.

Jyothi

Jyothi

Next Story