మళ్లీ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న వివి వినాయక్

మళ్లీ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న వివి వినాయక్

Rama Rao
Updated on: 18 Sept 2022 7:30 PM IST
Director VV Vinayak Will Become the Hero | Tollywood News
X

మళ్లీ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న వివి వినాయక్

VV Vinayak: ఆది, చెన్నకేశవరెడ్డి, లక్ష్మి, కృష్ణ, వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన వివి వినాయక్ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో మంచి పేరును తెచ్చుకున్నారు. కానీ గత కొంతకాలంగా వినాయక్ చేతిలో ఒక్క మంచి హిట్ సినిమా కూడా లేదు. మెగాస్టార్ కం బ్యాక్ సినిమా పుణ్యమా అని ఖైదీ నెంబర్ 150 తో మంచి హిట్ అందుకున్న వినాయక్ ఆ తరువాత దర్శకత్వాన్ని వదిలేసి కొన్నాళ్లు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు చేశారు. "సీనయ్య" అనే ఒక సినిమా పట్టాలెక్కింది కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా వెలుగులోకి రాలేదు.

అయితే ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వినాయక్ హీరో గానే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి కూడా వివి వినాయక్ హీరోగా త్వరలోనే ఒక సినిమా పట్టాలెక్కనుందట. దీని గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. అయితే ఈ సినిమాకి తానే స్వయంగా నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు వినాయక్. దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న వివి వినాయక్ ఇప్పుడు హీరోగా కూడా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story