ఎక్కడ ఎక్కాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వారే 'చిరంజీవి'

ఎక్కడ ఎక్కాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వారే చిరంజీవి
x
Highlights

చిరు చిరుయే..ఎక్కడ ఎక్కాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా చిరంజీవికి బాగా తెలుసు.

చిరు చిరుయే..ఎక్కడ ఎక్కాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా చిరంజీవికి బాగా తెలుసు. రాజకీయాల్లో రాణించలేకపోయినా, వ్యక్తిత్వంలో మాత్రం తననెవరూ బీట్ చేయలేరని మరోసారి నిరూపించుకున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి, చిరంజీవి ఇద్దరూ టాప్ సెలబ్రిటీలే.. ఇద్దరి కాంబినేషన్ లోనూ దాదాపు 19 సినిమాలకు పైనే వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. అప్పట్లో ఈ సినిమా క్రెడిట్ నాదంటే నాదంటూ ఇద్దరూ క్లెయిమ్ చేశారని.. ఇద్దరి మధ్యమాటలు బంద్ అయ్యాయనీ కొన్నాళ్లు టాక్ నడిచింది.

చిరు ఏ సినిమా అయినా, పక్కన విజయశాంతి ఉంటేనే అది హిట్ అనే ఒపీనియన్స్ కూడా వినిపించాయి. సినీ రంగంలో ఇంత సమఉజ్జిలుగా నిలిచిన వీరు రాజకీయాల్లో మాత్రం చెరో దారి పట్టారు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపిస్తే, విజయశాంతి ముందు బీజేపీలోనూ ఆ తర్వాత తల్లి తెలంగాణ, ఆపై దాన్ని టీఆరెస్ లో విలీనం చేసి తనదైన పంథాలో నడిచారు. అప్పట్లో ఇద్దరి మధ్యా మాటల తూటాలే పేలాయి.

చిరంజీవిని ఆయన పార్టీని విమర్శిస్తూ విజయశాంతి పలు వేదికలపై విమర్శనాస్త్రాలు సంధించారు. సామాజిక న్యాయం పేరుతో చిరంజీవి ప్రజారాజ్యం ని నడిపిస్తే.. విజయశాంతి తెలంగాణ సెంట్రిక్ గా రాజకీయ అడుగులు వేశారు. అణగారిన తెలంగాణ, బడుగుల తెలంగాణ గురించి చిరంజీవికి ఏం తెలుసునని, విజయశాంతి విమర్శలు ఎక్కు పెట్టారు.సామాజిక న్యాయం అంటూ చేస్తున్న ప్రకటనలన్నీ పైపై మాటలేనని విమర్శించారు. ప్రతీ వేదికపైనా చిరంజీవిని ఏకి పారేశారు. విజయశాంతి తీరు చూసిన వారంతా వీరిద్దరిమధ్యా ఇండస్ట్రీలో ఆధిపత్య పోరు నడిచిందని. అది రాజకీయాలకూ విస్తరించిందని కామెంట్ చేశారు. చిరంజీవి రాజకీయ పంథాను విజయశాంతి చాలా ఘాటుగానే విమర్శించారు. అయితే చిరంజీవిది పూర్తిగా భిన్నమైన తీరు. ఆయన ఎవరిపైనా ఘాటైన విమర్శలు చేయలేరు. ఎవరినైనా మంచి మనసుతో పలకరిస్తారు. గట్టిగా ఎవరిపైనా కామెంట్ చేయరు. అందుకే విజయశాంతి పొలిటికల్ గా చేసే విమర్శలన్నింటినీ మౌనంగానే ఎదుర్కొనేవారు. అడపా దడపా ప్రతివిమర్శ చేసినా. అదీ ఘాటుగా ఉండేది కాదు.

ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత అంటే దాదాపు 20ఏళ్ల తర్వాత మళ్లీ ఇద్దరూ ఒకే వేదికపై కలిసినా చిరంజీవిది అదే తీరు. అదే ఆత్మీయత.. 20 ఏళ్ల నాటి తన హీరోయిన్ ని మనసారా పలకరించారు. తనను రాజకీయంగా మరీ అంత ఘాటుగా విమర్శించడానికి మనసెలా ఒప్పిందని సరదాగానే నిలదీశారు. తన ప్రతీ సినిమాలో డైలాగ్ ని గుర్తు చేసుకున్నారు.. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా, ఆప్యాయంగా పలకరించారు. తన మెగా మనసును మరోసారి చాటుకున్నారు. అభిమానుల వేదిక సాక్షిగా, విజయశాంతిని తన హీరోయిన్ అని గర్వంగా చెప్పారు..

ఇక చిరంజీవి సరదా కౌంటర్లను విజయశాంతి కూడా అంతే స్వీటుగా తీసుకున్నారు. గ్యాంగ్ లీడర్ లో డైలాగ్ ను రిపీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితో లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి మెగా ఛాలెంజ్ విసిరింది. చిరుతో కలసి నటించేందుకు సై అంటే సై అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇద్దరి మార్కెట్ దాదాపు సేమ్. ఇద్దరూ పొలిటికల్ గా చరిత్ర సృష్టించిన వారే. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసి నటించేందుకు రెడీ అంటున్నారు. ఇద్దరు మెగా స్టార్లు నటిస్తే. ఎవరిది లీడ్ రోల్ అవుతుంది? చిరుతో సమానంగా డాన్స్ లో చెలరేగే విజయశాంతి తనకూ ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదని నిరూపించుకుంది.ఒకప్పుడు చిరు సినిమా రిలీజ్ అవుతుంటే అందుకు దీటుగా

విజయశాంతి లేడీ ఒరియంటెడ్ మూవీలొచ్చేవి. ఈ మెగాస్టార్లిద్దరూ అటు బాలీవుడ్ లోనూ సందడి చేశారు. చిరు ఆజ్ కా గుండా రాజ్, ది జెంటిల్మన్ అనే సినిమాల్లో నటిస్తే, విజయ శాంతి ఏకంగా లేడీ అమితాబ్ అనేంతలా బాలీవుడ్ లోనూ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ప్రతిఘాత్, ఈశ్వర్, ముకద్దర్ కా బాద్ షా, అపరాథి, తేజస్విని, గూండా గిరి సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పుడు కలసి నటించడానికి ఇద్దరూ సిద్ధపడటంతో మళ్లీ మరో మెగా హిట్ కు అభిమానులు రెడీ కావాల్సిందే. సరిలేరు నీకెవ్వరు ఆడియోరిలీజ్ ఫంక్షన్ లో తన ఆత్మీయ ప్రసంగంతో చిరంజీవి మరోసారి ఇండస్ట్రీకే మెగా బాస్ అనిపించుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories