ముందునుంచీ చిరంజీవి నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు.. మహేష్ బాబు

ముందునుంచీ చిరంజీవి నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు.. మహేష్ బాబు
x
Highlights

మహేష్ బాబు ఆర్మ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న'సరిలేరు నీకివ్వరూ' సినిమా రేపు విడుదల కానుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ప్రమోషన్ పనులు పీక్స్ లో...

మహేష్ బాబు ఆర్మ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న'సరిలేరు నీకివ్వరూ' సినిమా రేపు విడుదల కానుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ప్రమోషన్ పనులు పీక్స్ లో ఉన్నాయి. మహేష్ బాబు బిజీ బిజీగా ఈ సినిమాకి సంబంధించిన విషయాలను ప్రజలకు వివిధ వేదికల ద్వారా స్వయంగా వెల్లడిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

మహేష్ బాబు వెళ్లిన ప్రతి ఇంటర్వ్యూలోనూ మెగాస్టార్ చిరంజీవి ప్రసక్తి వస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. 'సరిలేరు నీకివ్వరూ' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అయన ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా అయన మహేష్ బాబు గురించి, విజయశాంతి గురించి.. మరీముఖ్యంగా అలనాటి సూపర్ స్టార్, మహేష్ బాబు తండ్రి నటశేఖర కృష్ణ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. అసలు ఆ వేదిక మీద చిరంజీవి మాటలే హైలైట్ అయ్యాయి. ఈ సందర్భంగా అయన కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇప్పుడు మహేష్ బాబు ఎక్కడకు వెళ్లినా ఈ విషయ గురించి అడుగుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మళ్ళీ ఈ ప్రశ్న ఎదురైంది. చిరంజీవి మీ నాన్న గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని అన్నారు.. దీని గురించి మీ నాన్నగారు ఏమన్నారు? అని మహేష్ ను ఆ ఇంటర్యూలో అడిగారు. దానికి మహేష్ బాబు '' ఆయన చాలా సంతోషించారు. చిరంజీవి గారు చాలా బాగా మాట్లాడారు. ఆయనకు థాంక్స్ చెప్పు'' అన్నారు అని చెప్పారు. ''నిజానికి చిరంజీవి అలా మాట్లాడటం నాకు చాలా సంతోషం వేసింది. అయన మొదట్నుంచీ నన్ను ప్రోత్సహిస్తున్నారు. '' అంటూ చెప్పుకొచ్చారు.

ఇక సినిమాలో విజయశాంతి తో నటించేటప్పుడు మీకెలా అనిపించింది అని అడిగిన ప్రశ్నకు మహేష్ బదులిస్తూ.. మొదటి రోజు సెట్ లో కొంచెం కంగారు అనిపించింది. ఆ తరువాత సీన్ పూర్తయ్యాకా, విజయశాంతీ, నేను కూర్చుని మాట్లాడుకున్నాం. ఆసమయంలో కొడుకు దిద్దిన కాపురం సినిమా రోజుల గురించి చెప్పుకున్నాం అంటూ బదులిచ్చారు మహేష్.

సరిలేరు నీకెవ్వరూ సినిమా ఎలా మొదలైంది అన్న ప్రశ్నకు మహేష్ బదులిస్తూ.. ''అనిల్ నాకు ఈ కథను ఎఫ్2 షూటింగ్ జరుగుతున్న సమయంలోనే చెప్పాడు. కథ నాకు బాగా నచ్చింది. వెంటనే చేసేయాలనుకున్నాను. కానీ, నాకు మధ్యలో మరో సినిమా ఉండడం తో దాని తరువాత చేద్దాం అని చెప్పను. అయితే, ఎఫ్2 సినిమా చూసిన వెంటనే.. ఈ సినిమాని ఆలస్యం లేకుండా చేసేయాలనిపించింది. దాంతో అనిల్ ను సినిమా వేగంగా పూర్తి చేయగలరా? అని అడిగాను. చేసేద్దాం అన్నాడు అనిల్. అంతే.. సినిమా పట్టాలెక్కింది.. పరుగులు పెట్టింది.. ఐదు నెలలలోనే విడుదలకు సిద్ధం అయిపొయింది. ఇంత తక్కువ సమయంలో సినిమా పూర్తి చేయడం అంత ఈజీ కాదు. ఈ సినిమా ఇలా పూర్తయి మీ ముందుకు వచ్చిందంటే దానికి కారణం అనిల్ రావిపూడి. నేనైనా కొద్దీ రోజులు మధ్యలో విరామం తీసుకున్నాను. కానీ, ఈ చిత్ర బృందం మాత్రం పగలూ రాత్రీ సినిమా చేస్తూనే వచ్చారు. ఇదంతా వారి ప్రతిభే'' అని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories