శృతిహాసన్ డేట్లు కోసం వెతుకుతున్న చిరంజీవి మరియు బాలకృష్ణ

Chiranjeevi and Balakrishna looking for Shruti Haasan Dates | Tollywood News
x

శృతిహాసన్ డేట్లు కోసం వెతుకుతున్న చిరంజీవి మరియు బాలకృష్ణ

Highlights

శృతిహాసన్ డేట్లు కోసం వెతుకుతున్న చిరంజీవి మరియు బాలకృష్ణ

Shruti Haasan: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్బికె 107 మరియు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్షన్లో నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలు రెండు వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కి సిద్ధమవుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ రెండు సినిమాలను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్టార్ బ్యూటీ శృతిహాసన్ ఈ రెండు సినిమాలలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే గత కొద్ది రోజులుగా ఈ రెండు సినిమాల మధ్య సంక్రాంతి బరిలో ఎవరు దిగాలి అనే చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే విడుదల సంగతి పక్కన పెడితే షూటింగ్ పూర్తి కావడానికి కూడా ఈ రెండు సినిమాలకు శృతిహాసన్ డేట్లు కావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒకేసారి ఈ రెండు సినిమాలకు డేట్లు ఇవ్వడం ఇవ్వడానికి శృతిహాసన్ తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు సినిమాలు మాత్రమే కాక యంగ్ రెబల్ సార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "సలార్" సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories