Boyapati Srinu: రామ్ కోసం బాలయ్య స్ట్రాటజీ వాడబోతున్న బోయపాటి

Boyapati Srinu is Going to use Balakrishna Strategy for Ram
x

Boyapati Srinu: రామ్ కోసం బాలయ్య స్ట్రాటజీ వాడబోతున్న బోయపాటి

Highlights

Boyapati Srinu: బాలకృష్ణ ఫార్ములానే రామ్ కి వాడనున్న బోయపాటి

Boyapati Srinu: స్టార్ డైరెక్టర్ బోయపాటి మరియు సీనియర్ హీరో బాలకృష్ణ కాంబినేషన్లో ఇప్పటికే సింహా లెజెండ్ మరియు అఖండ వంటి ఈ మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ మూడు సినిమాల్లోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ మూడు సినిమాలలోను బాలకృష్ణ రెండు రకాల గెటప్పుల్లో కనిపిస్తారు. అందులో ఒక పాత్ర క్లాస్ గా ఉంటే మరొక పాత్ర పూర్తి వైల్డ్ గా ఉంటుంది. అదే బోయపాటి సక్సెస్ స్ట్రాటజీ.

ఇది ఇప్పటికే చాలాసార్లు వర్క్ అవుట్ అయింది. తాజాగా ఇప్పుడు బోయపాటి ఇదే ఫార్ములాని రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా వాడబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ పోతినేని హీరోగా బోయపాటి దర్శకత్వంలో త్వరలో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రామ్ తన విశ్వరూపం చూపించబోతున్నారట.

ఇందులో కూడా రామ్ రెండు రకాల గెటప్పుల్లో కనిపించబోతున్నారని సమాచారం. ఇంతకుముందు రామ్ ఇలాంటి వైల్డ్ పాత్రలో కనిపించలేదట. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. లెజెండ్‌, అఖండ‌ ల లాగా ఈ సినిమా కోసం కూడా బోయపాటి మూడు అక్ష‌రాల ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ వెతుకుతున్నట్టు సమాచారం. త్వ‌ర‌లోనే ఓ మంచి ముహూర్తం చూసుకొని టైటిల్ ని కూడా అధికారికంగా ప్రకటించాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories