Bigg Boss3 telugu Eliminations: శిల్పా.. వైల్డ్ గా వచ్చి..కూల్ గా వెళ్ళిపోయింది!

Bigg Boss3 telugu Eliminations: శిల్పా.. వైల్డ్ గా వచ్చి..కూల్ గా వెళ్ళిపోయింది!
x
Highlights

ఆదివారం బిగ్ బాస్ సరదాగా సాగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ శిల్ప హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. వెళుతూ వెళుతూ అందరికీ బిరుదులు ఇచ్చిపోయింది.

బిగ్ బాస్ ఆదివారం సందడిగా సాగింది. శనివారం నాటి సీరియస్ నెస్ పక్కన పెట్ట హౌస్ మేట్స్ తో సరదా గేమ్ లు ఆడించాడు బిగ్ బాస్. ఇక ఎలిమినేషన్ నుంచి ఎవరు సేవ్ అయ్యారు అనేదాన్ని ఈ గేమ్ ల మధ్యలో చెబుతూ వచ్చారు. చివరికి అంతా ఊహించినట్టే శిల్ప చక్రవర్తి ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ కలిసిరావడం లేదు..

బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కామన్. అయితే, గత రెండు సీజన్ లలోనూ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారు కొంత కాలం హౌస్ లో గట్టి పోటీదారులుగా నిలిచారు. కానీ ఈ సీజన్ లో మొదట తమన్నా సింహాద్రి.. రెండో వారం లోనే ఎలిమినేట్ అయిపోయింది. ఇక శిల్పా చక్రవర్తి దీ అదే దారైంది. అయితే, ఎలిమినేషన్ సమయంలో హౌస్ మేట్స్ మధ్య ఎమోషనల్ ఫీలింగ్స్ కనబడడం ఇప్పటివరకూ చూశాం. మొదటి సారి శిల్ప ఎలిమినేట్ అయినప్పుడు హౌస్ మేట్స్ అందరూ నవ్వుతూ సాగనంపారు.

కూల్ డ్యూడ్ వరుణ్..!

శిల్ప హౌస్ నుంచి బయటకు వచ్చినతరువాత కొద్దిసేపు నాగార్జున ఆమెతో ఆటలదించారు. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ ఒక్కోరికి ఒక్కో బిరుదు ఇవ్వాలని కొన్ని బిరుదులూ కాగితాల పై రాసి ఆమెకు ఇచ్చారు. ఆమె అందరికీ అన్ని బిరుదులూ పంచింది.. ఒక్క వరుణ్ కి తప్ప.. వరుణ్ కూల్ డ్యూడ్ అంటూ పొగడ్తలతో ముంచేసింది. ఇక బాబా భాస్కర్ ని జిత్తులమారిగా పేర్కొన్న శిల్ప మహేష్ ని తిక్కలోడు అంది. రాహుల్ కోపిష్టి అనీ.. పునర్నవి మూర్ఖురాలు అనీ చెప్పింది. రవికృష్ణ మొండోడు అని చెప్పిన శిల్ప శివజ్యోతి రాక్షసి అని ముద్దుగా చెప్పింది. హిమజ అహంకారి అని బిరుడు ఇచ్చేసింది. ఇక అపోతూ పోతూ వారం అంతా ఎవరు నిద్రపోయినా కుక్క మొరిగితే మహేష్ పూల్ లో దూకాలని బిగ్ బాంబ్ వేసి పోయింది శిల్పా చక్రవర్తి.

అంతా ఫన్..

అంతకు ముందు సరదా స్కిట్ ల తో హౌస్ లో ఫన్ క్రియేట్ అయింది. రాహుల్ జింగిల్స్ తో అందర్నీ అదరగొట్టాడు.

మొత్తమ్మీద ఈ ఆదివారం ఎపిసోడ్ ఆటవిడుపు గా సాగింది. అందర్నీ నవ్వించింది. ఎలిమినేషన్ కూడా చాలా కూల్ గా జరిగింది. వారం మొత్తం ఎపిసోడ్ లలో ఉన్న లోటుపాట్లను ఆదివారం ఎపిసోడ్ తుడిచేసిందని చెప్పొచ్చు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories