Top
logo

Bigg Boss3 telugu Episode 53: బూట్లు తుడవాలా... చెడ్డీలు ఉతకొద్దా? మహేష్..పునర్నవి తిరుగుబావుటా!!

Bigg Boss3 telugu Episode 53: బూట్లు తుడవాలా... చెడ్డీలు ఉతకొద్దా? మహేష్..పునర్నవి తిరుగుబావుటా!!
X
Highlights

బిగ్ బాస్ దెయ్యాల టాస్క్ దెయ్యమై బిగ్ బాస్ కే చుట్టుకుంది. పునర్నవి, మహేష్ విట్టాలు బిగ్ బాస్ టాస్క్ లు, శిక్షల పై ఒక రేంజిలో చెలరేగారు. మహేష్ కొద్దిగా రాజీపడినా.. పునర్నవి మాత్రం ఎక్కడా తగ్గకుండా బిగ్ బాస్ కి చుక్కలు చూపెడుతోంది. బిగ్ బాస్ లో ఆదుకోమంటే బిగ్ బాస్ తోనే ఆడేసుకుంటోంది పునర్నవి.

బిగ్ బాస్ ఇంట్లో దెయ్యం నాకేంటి భయం టాస్క్ హౌస్ లో వేడి పుట్టించింది. ఏ ఎపిసోడ్ లోనూ లేనటువంటి విధంగా ఒకరకంగా చెప్పాలంటే.. బిగ్ బాస్ షో లో ఎప్పుడూ జరగని విధంగా ఈసారి జరిగింది. టాస్క్ విషయంలో నిన్న పునర్నవి బిగ్ బాస్ ను చెత్త టాస్క్ లు అంటూ తిట్టిన విషయం తెలిసిందే. దానికి ఈ ఎపిసోడ్ లో కొనసాగింపు జరిగింది. పునర్నవి ఎటువంటి పరిస్థితి లోనూ ఈ చెత్త ఆట ఆడను అని చెబుతూనే చాలా సీరియస్ అయింది.. ఆమె ఏమందో ఆమె మాటల్లోనే..

"టాస్క్‌లు ఇచ్చేటప్పుడు సరిగా ఇవ్వండి. వాళ్లకు ఒకలా మాకు ఒకలా చెప్పే పిచ్చి టాస్క్‌లు ఇవ్వొద్దు. ఎప్పుడు బిగ్ బాసే రైట్ అనుకోవద్దు. నువ్ ఎప్పుడూ రైట్ కాదు. బిగ్ బాస్ చెప్తున్నా విను ఇలాంటి ముష్టి టాస్క్‌లు ఇచ్చి మేం నూరు శాతం ఎఫర్ట్ పెడితే మీకు ఇష్టం వచ్చినట్టు రద్దు చేస్తారు. అలాంటప్పుడు మాకు కూడా కాలుతుంది. ఎమోషనల్ డ్రైన్ చేయడం కరెక్ట్ కాదు. కొంచెం సెన్స్ ఉన్న టాస్క్‌లు ఇవ్వండి. నా రియాక్షన్ తప్పైతే బయటకు పోతా. టాస్క్ అన్నప్పుడు క్లియర్‌గా ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వాలి.. సిల్లీ గేమ్స్ ఇవ్వకు" అంటూ బిగ్ బాస్‌ పై విరుచుకు పడింది.

ఇక బిగ్ బాస్ నియమాలను ఉల్లంఘించారంటూ పునర్నవి, మహేష్ విట్టా, శ్రీముఖి లకు శిక్ష విధించాడు బిగ్ బాస్. షో పాలిష్ చేయమని ఆదేశించాడు. ఇది మరో దుమారం లేపింది. పునర్నవి ఈ శిక్షకు ఎంతమాత్రం అంగీకరించలేదు.

తొక్కలో గేమ్ నేను షూ క్లీన్ చేయడం ఏంటి? అంటూ ఆమె విరుచుకు పడింది. నాకు శిక్ష దేనికి వేశారు.. చెత్త టాస్క్ ఇచ్చింది బిగ్ బాస్. దానికి నేను ఎందుకు షూ క్లీన్ చేయాలి అంటూ ఫైర్ అయ్యింది పునర్నవి. నన్ను పూల్‌లోకి తోసి.. దెబ్బలు కొట్టించుకుని ఇప్పుడు శిక్ష అనుభవించాలా? నో వే.. ఏం చేస్తారో చేసుకోండి అవసరమైతే భయటకు పోతా తప్ప ఈ పని చేయనని కుండ బద్దలు కొట్టేసింది పున్నూ. నన్ను తోచారు ఇష్టం వచ్చినట్టు చేశారు మరి దానికి ఏంటి? నన్ను టార్చర్ చేసి.. నన్ను హింసపెట్టి నేను ఈ పని చేయాలా? నన్ను ఎవరూ కన్వెన్స్ చేయొద్దు. బుద్ధిలేదా అసలు ఇలాంటి టాస్క్‌లు చేయడానికి. ఈడ్చుకెళ్లి పూల్‌లో పడేసినా రియాక్ట్ కావొద్దన్నారని నేను పూల్‌లో పడేసినా రియాక్ట్ కాలేదు. ప్రతి దానికి ఒక విధానం ఉంటుంది. నేను ఎలాంటి శిక్షను అనుభవించను. ఇక్కడకు నేను వచ్చింది. షూ పాలిష్ చేయడానికి కాదు. నేను ఏం తప్పు చేశానో చెప్తే తప్పకుండా చేస్తా. చెత్త టాస్క్‌లు ఇస్తే నేను ఎందుకు బాధ్యత వహించాలి. నేను ఇప్పుడు తగ్గితే ఇంటి నుండి బయటకు వెళ్లినా నేను డౌన్ అయినట్టే. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇది చేయను. నేను దెబ్బలు తగిలించుకుని గేమ్ ఆడితే చెత్త పెర్ఫామెన్స్ అని ఎలా అంటారు అని కన్నీళ్లు పెట్టుకుంది పునర్నవి. అయితే ఎంత మంది ఆమెను కన్వెన్స్ చేయడానికి ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు పునర్నవి. ఇంటి నుండి వెలిపోవడానికైనా సిద్ధమే తప్పితే నేను షూ పాలిష్ చేయను అని బిగ్ బాస్‌ ని ధిక్కరించి నిలబడింది పునర్నవి. ఆత్మాభిమానం విలువ చెప్పింది ఆమె.

చెప్పులు తుడవాలా? చెడ్డీలేం ఉతకొద్దా బిగ్ బాస్?: మహేష్

పునర్నవి తరువాత ఇదే పద్ధతిలో మహేష్ విట్టా కూడా పూర్తిగా బిగ్ బాస్ ను కదిగేశాడు. తప్పు చేస్తే చెప్పులు తుడవడం ఏంటి? అంటూ ఫైర్ అయ్యారు మహేష్ విట్టా. నా షర్ట్‌లు చినిగి పోయాయి. ముందు షర్ట్‌లు పంపించండి. మరీ దారణంగా చెప్పులు కడిగేది ఏంటి? మరీ అంత చీప్‌గా కనిపిస్తున్నామా? షర్ట్‌లు చిరిగిపోతే చెడ్డీతో ఉన్నా నేను. పిచ్చోళ్ల మాదిరి కనిపిస్తున్నామా? బట్టలన్నీ విప్పేసి కూర్చోవాలా? చెప్పులు తుడవమనడం టాస్కా? రేపు మీరు విప్పేసిన చెడ్డీలు ఉతకమంటారు ఉతకాలా? ఇక్కడకు గేమ్‌ ఆడటానికి వచ్చింది మనసు చంపుకోవడానికి కాదు.. గతిలేక అంతకంటే కాదు. ఆడిషన్స్‌లో వచ్చిన వాళ్లమా మేం. అప్లికేషన్ పెట్టి మమ్మల్ని తీసుకోండి. మేం చింపేస్తాం అన్నామా? అప్లికేషన్ మీద రావడం వేరు ఇన్విటేషన్ మీద రావడం వేరు. చెప్పులు కడగండి. చెడ్డీలు ఉతకండి అంటే చేయాలా? అంటూ బిగ్ బాస్‌ని ఓ రేంజ్‌లో ఏకిపారేశాడు మహేష్ విట్టా.

వెనక్కి తగ్గని పునర్నవి..రాజీపడిన మహేష్.. ముందే సిద్ధమైన శ్రీముఖి..

అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లను కంప్లీట్ చేయకపోతే డైరెక్ట్‌గా ఎలిమినేషన్‌కి నామినేట్ చేస్తాం అని హెచ్చరించడంతో శ్రీముఖి ముందుగానే చెప్పులు తుడిచేందుకు సిద్ధపడింది. ఇక మహేష్‌ని శివజ్యోతి కన్వెన్స్ చేయడంతో వెనక్కి తగ్గి అయిష్టంగానే షూ పాలిష్ చేశాడు మహేష్. అయితే పునర్నవి మాత్రం ఏం చేస్తారో చేసుకోండి. ఉంటే ఉంటా పోతే పోతా.. ఎలిమినేష్ చేసినా డోన్ట్ కేర్ అంటూ బిగ్ బాస్‌ మాట వినేది లేదు.. నా తప్పులేదు. నేను శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు అంటూ ఖారఖండిగా చెప్పేసింది. ఎవరు ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ హైలైట్ పునర్నవి.. కోపం వేరు ఆత్మాభిమానం వేరు. టాస్క్ మీద ఆమె కోపగించుకుని ఉండొచ్చు. కానీ శిక్ష విషయంలో ఆమె నూటికి నూరుపాళ్ళూ కరెక్టే చేసింది. బిగ్ బాస్ రూల్స్ వంటివి పక్కన పెడితే ఆమె లాజిక్ గా మాట్లాడింది. ఎవరు..ఎంత చెప్పినా వినకుండా తన మాట మీదే నిలబడడం ఆకట్టుకున్నాయి. మహేష్ విట్టా కూడా తను చేయాల్సింది చేశాడు. ఇక బిగ్ బాస్ లో ఇవన్నీ మామూలే. ఇక తరువాతి ఎపిసోడ్ లో ఏం చేస్తారన్నది వేచి చూడాల్సిందే.


Next Story