Top
logo

Bigg Boss3 telugu Episode 46: హింసాత్మక కొనసాగింపు..నలిగిపోయిన శిల్ప!

Bigg Boss3 telugu Episode 46: హింసాత్మక కొనసాగింపు..నలిగిపోయిన శిల్ప!
Highlights

అదే హింస.. దొంగలు పడ్డారు ఆటకి కొనసాగింపు.. బిగ్ బాస్ షోలో కుటుంబ సమేతంగా హింసను భరించాల్సిన పరిస్థితి ఎదురైంది బిగ్ బాస్ వీక్షకులకు

దొంగల ఎపిసోడ్ రెండోరోజూ కొనసాగింది. మళ్ళీ దానికి లెవెల్ 2 అని పేరు. హింసను కూడా లెవెల్స్ వారీగా పెంచి చూపించాడు బిగ్ బాస్. నిధిని కాపాడుకోవడం మొదటి లెవెల్ ఈ భాగంలోనే హౌస్ మేట్స్ హింశాత్మకంగా ప్రవర్తించి.. రక్తాలు కారేలా వ్యవహరించారు. ఇక లెవెల్ 2 లో దొంగల రాణిని పట్టుకుని బంధించడం.. వహ్వా బిగ్ బాస్.. హింసాత్మక వినోదం తో ఆకట్టుకోవాలనే ప్రయత్నం చాలా బావుంది.

ఈ ఎపిసోడ్ లో ఏ మాత్రం హర్షించదగ్గ అంశాలు లేవు. దొంగల రాణిగా ఉన్న శిల్పను బంధించి జైలు లో పెట్టడమే ముఖ్యమైన టార్గెట్. నగరవాసులు ఆమెని పట్టుకోవాలి.. దొంగలు ఆమెను రక్షించాలి. ఈ రెండు ముక్కలూ చాలు టాస్క్ వెనుక ఎంత హింస ఉంటుందో చెప్పడానికి. ఇక శిల్పకి చుక్కలు చూపించారు హౌస్ మేట్స్. కొత్తగా హౌస్ లోకి వచ్చింది. సరిగ్గా దొరికింది అనుకున్నారేమో ఇష్టం వచ్చినట్టు ఆమెను ఆదేసుకున్నారు. ఆమెను బంధించాలనే ప్రయత్నంలో వివరించి చెప్పలేని విధంగా ఆమెపై హింస చోటు చేసుకుంది. ఇది హౌస్ మేట్స్ తప్పు ఎంతమాత్రం కాదు. గేమ్ ఆడాలి అన్నప్పుడు అందరూ గెలవాలని ప్రయత్నిస్తారు. అందులోనూ ఇటువంటి ఆటలో విచక్షణ ఉండే ఛాన్స్ లేనేలేదు. సరిగ్గా అదే జరిగింది. తన ఆయుధాన్ని రక్షించుకోవడానికి స్విమ్మింగ్ పూల్ లోకి దూకింది శిల్ప. ఆమెను కాపాడటానికి రవి దూకాడు. ఆమెను పట్టుకోవడానికి శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ దూకారు. రెండు గ్రూపుల మధ్యలో స్విమ్మింగ్ పూల్ లో నలిగిపోయింది శిల్ప. ఇంతకు మించి దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు.

తెలుగు సినిమా ఆఖరులో అంతా అయిపోయాకా వచ్చే పోలీసులా.. బిగ్ బాస్.. ఆపండి! హింస ఎక్కువైంది అన్నాడు. అంతా తూచ్ ఈ గేమ్ రద్దు అన్నాడు. దెబ్బతో అటు హౌస్ మేట్స్ ఇటు వీక్షకులూ పిచ్చోళ్లు అయిపోయారంతే. ఇక గేమ్ రద్దు చేసిన బిగ్ బాస్.. హౌస్ మేట్స్ మధ్యలో గొడవలు కయ్యాలు పెట్టె కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఈ టాస్క్ రద్దు కావడానికి కారణం ఎవరో తేల్చి చెబితే శిక్షిస్తాన్నన్నాడు. రాహుల్, రవికృష్ణ లను ఎక్కువ మంది సూచించారు. దీంతో వారికి జైలు శిక్ష వేశాడు బిగ్ బాస్. అక్కడ ఆహారం కూడా ఉప్పు లేని జావ ఇచ్చాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ వారిపై జాలి కురిపించేశారు. ఇక అలీ వెక్కి వెక్కి ఏడ్చాడు.

ఇదిలా ఉంటే.. భార్యాభర్తలు వితిక, వరుణ్ లు ఒకరిని ఒకరు నిందించుకున్నారు.. కాదు నిందించు కుంటూ ఉన్నారు. ఎందుకంటే.. ఈరోజు కూడా ఇదే కొనసాగింపుగా కనిపిస్తుందని ముందస్తు హెచ్చరిక (ప్రోమో) లో చూపించారు.

మొత్తమ్మీద చెప్పలేని హింస తో ఈ ఎపిసోడ్ నడిచింది. తప్పు చేసేలాంటి అవకాశాలు కల్పించి.. తరువాత వారి మీద నిందలు వేసి.. ఎదో కాలాన్ని నడిపిస్తున్నారు.

ఈవారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారని అనుకుంటున్నారో ఇక్కడ తెలపండి
Next Story

లైవ్ టీవి


Share it