Bigg Boss 3 Episode 61 highlights: గురుశిష్యుల ప్రచార యుద్ధం..భావోద్వేగాల కొనసాగింపు ..

Bigg Boss 3 Episode 61 highlights: గురుశిష్యుల ప్రచార యుద్ధం..భావోద్వేగాల కొనసాగింపు ..
x
Highlights

కొంచెం సరదా.. కొంచెం సంతోషం.. మరికొంచెం ఎమోషనల్ టచ్ ఇలా సాగింది బిగ్ బాస్ ఎపిసోడ్ 61. ఆ విశేషాలు చూసేద్దామా..

బిగ్ బాస్ కాలేజీ టాస్క్ ముగిసింది. ఇక టాస్క్ రిజల్ట్స్ ప్రకటించారు. ఇంటికి కెప్టెన్ ఎన్నుకున్నారు. హౌస్ మేట్స్ అందరికీ తమ ఇంటి సభ్యులను చూపించి వారితో గేమ్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్ ఇవీ ఎపిసోడ్ 61 విశేషాలు

బెస్ట్ టీచర్ ఎవరు?

బిగ్ బాస్ కాలేజీలో బెస్ట్ టీచర్ ఎవరు అనే అంశం పై హౌస్ మేట్స్ లో పెద్ద చర్చ జరిగింది. వరుణ్, బాబా భాస్కర్ ల మధ్య గట్టి పోటీ నడిచింది. వరుణ్ గెలుస్తాడనిపించినా..రవి యూ టర్న్ తీసుకోవడంతో బాబా భాస్కర్ బెస్ట్ టీచర్ గా నిలిచారు. పునర్నవి ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి వెళ్ళగక్కింది. వరుణ్ ను ప్రకటించాలని భావిస్తే.. రవి సడెన్ గా మారిపోయి బాబా పేరు చెప్పారంటూ ఫైర్ అయింది.

బెస్ట్ స్టూడెంట్ ఎవరు?

బిగ్ బాస్ కాలేజీ లో బెస్ట్ స్టూడెంట్ ఎవరు అనే దానిపై ఓటింగ్ జరిగింది. దాదాపుగా అందరూ మహేష్ విట్టా పేరు చెప్పారు. దాంతో మహేష్ ని బెస్ట్ స్టూడెంట్ గా ప్రకటించారు.

ప్రచారమే ఆయుధం!

గురువుతో శిష్యుడు పోటీ..ఆసక్తికరంగా సాగింది. బెస్ట్ టీచర్ గా ఎన్నికైన బాబా భాస్కర్, బెస్ట్ స్టూడెంట్ గా ఎన్నికైన మహేష్ విట్టాలు ఇద్దరూ కెప్టెన్సీ పోటీదారులుగా బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో ఇద్దరి మధ్య పోటీ పడింది. అయితే, దీనికి గాను బిగ్ బాస్ ఎవరి ప్రచారం వాళ్ళే చేసుకోవాలన్నాడు. ఇంటి సభ్యులందరి దగ్గరికీ వెళ్లి తమకు ఓటు ఎందుకు వేయాలో చెప్పి, తమను కెప్టెన్ గా ఎన్నుకోమని కోరాలనీ, వారిలో ఎక్కువ మందిని కన్విన్స్ చేసి ఓట్లు తెచ్చుకున్న వారు కెప్టెన్ అవుతారనీ బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో మహేష్ విట్టా, బాబా భాస్కర్లు తమ తమ స్టైల్ లో ప్రచారం చేసుకున్నారు. తమకు ఎవరి ప్రచారం నచ్చిందో వారికి దండ వేసి తమ ఓటును చెప్పాలని బిగ్ బాస్ చెప్పాడు ఆ ప్రకారంగా బాబా భాస్కర్ కు హిమజ, పునర్నవి లు బాబా భాస్కర్ మేడలో దండలు వేసి తమ మద్దతు తెలిపారు. అయితే మిగిలిన సభ్యులు అందరూ అంటే..వరుణ్ సందేశ్, హిమజ, శివజ్యోతి, రాహుల్, రవి, శ్రీముఖిలు మహేష్ కి దండలు వేశారు. మొత్తం ఎనిమిది మందిలో ఆరుగురు మహేష్ కి మద్దతు పలకడం తొ గురువు బాబా భాస్కర్ పై మహేష్ విట్టా విజయం సాధించి ఈవారం ఇంటి కెప్టెన్ గా ఎన్నికయ్యారు.

భావోద్వేగాల సందడి..

ఇక ఎపిసోడ్ చివర్లో హౌస్ మేట్స్ అందరినీ ఆనందం.. బాధ రెండు రకాల ఫీలింగ్స్ తో ఏడిపించాడు బిగ్ బాస్. ఇంటికి దూరంగా తొమ్మిది వారాలుగా ఉంటున్న పర్తిసిపెంట్స్ అందరికీ వారి కుటుంబ సభ్యులని చూపించాడు బిగ్ బాస్. దీంతో అందరూ చాలా ఎమోషన్ అయ్యారు. వారిని చూసిన వెంటనే అందరూ తమ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులతో గేమ్ మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఒక్కోరికీ ఒక్కో బాక్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో బిగ్ బాస్ ఐకాన్ వస్తే ఆ హౌస్ మేట్ తరువాతి లెవెల్ కి వెళతారు. ఇలా ఐదుగురికి ఛాన్స్ ఉంటుంది. ఈ గేమ్ తరువాతి ఎపిసోడ్ లో కొనసాగుతుంది.

మొత్తమ్మీద గురు శిష్యుల మధ్య పోటీ.. ఆసక్తికరంగాసాగింది. ఆహ్లాదకరంగానే కెప్టెన్సీ ఎన్నిక జరిగింది. తరువాత కుటుంబ సభ్యులని తీసుకువచ్చి ఎమోషన్ పెంచిన బిగ్ బాస్ దానిని తరువాతి ఎపిసోడ్ వరకూ కొనసాగించడం ప్రేక్షకులకు సస్పెన్స్ లో ఉంచడమే కాకుండా తరువాతి ఎపిసోడ్ కోసం ఎదురు చూసేలా చేస్తోందని చెప్పొచ్చు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories