బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 35: పిచ్చి పీక్స్..'ఈగ'కు సంతాపం!

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 35: పిచ్చి పీక్స్..ఈగకు సంతాపం!
x
Highlights

వినోదాల వారాంతం బిగ్ బాస్ కొంత వినోదాన్ని తీసుకొచ్చింది. నాగార్జున శనివారం ఎంట్రీ అదిరింది. బాబా భాస్కర్ ఈగ కి సంతాప సభ పట్టి కొంతసేపు వీక్షకులకు పిచ్చి ఎక్కించారు. వీకెండ్స్ లో వినోదం పేరుతో పిచ్చి కామెడీ ప్రయత్నించి హౌస్ మేట్స్ అసహనం తెప్పించారు.

వినోదాల వారాంతం బిగ్ బాస్ కొంత వినోదాన్ని, మరింత సరదాల్ని తీసుకొచ్చింది. నాగార్జున శనివారం ఎంట్రీ అదిరింది. వస్తూనే మనోళ్లు ఏం చేస్తున్నారో చూద్దాం అంటూ బిగ్ బాస్ హౌస్ లో విశేషాల్ని చూపించి మాములుగానే క్లాసు పీకారు. బాబా భాస్కర్ ఈగ కి సంతాప సభ పట్టి కొంతసేపు వీక్షకులకు పిచ్చి ఎక్కించారు. వీకెండ్స్ వినోదంలో వినోదం పేరుతో పిచ్చి కామెడీ ప్రయత్నించి హౌస్ మేట్స్ అసహనం తెప్పించారు.

బిగ్ బాస్ పెట్టిన కుంపటి రాజుకుంది!

ఒకరికి తెలియకుండా, ఒకరికి వారి వీడియోలు చూపించి బిగ్ బాస్ గత ఎపిసోడ్ లో పెట్టిన చిచ్చు.. రగులుతూనే ఉంది. పైకి సర్డుకుపోయినట్టు కనిపించినా రాజుకుంటూనే కుంపటి వుంది. ఆ విషయం నాగార్జున ఇచ్చిన టాస్క్ లో స్పష్టంగా బయటపడింది. అందరికీ నాగార్జున ఓ చిన్న టాస్క్ ఇచ్చారు. మిత్రుడు, శత్రువు, వెన్నుపోటు దారు అని తాను భావిస్తున్న వారిని బోర్డు మీద రాసి, ఎందుకో చెప్పాలి. ఇందులో, పునర్నవి.. రాహుల్ (మిత్రుడు), శత్రువు (వరుణ్ సందేశ్), వితికా (వెన్నుపోటు) గానూ, హిమజ.. శ్రీముఖి (మిత్రుడు), వితికా (శత్రువు), అషురెడ్డి (వెన్నుపోటు), మహేష్ విట్టా.. బాబా భాస్కర్ (మిత్రుడు), అలీ రజా (శత్రువు), వెన్నుపోటు (శ్రీముఖి), వితికా.. పునర్నవి (మిత్రుడు), హిమజ (శత్రువు), రవిక్రిష్ణ (వెన్నుపోటు), రాహుల్.. పునర్నవి (మిత్రుడు), హిమజ (శత్రువు), రవిక్రిష్ణ (వెన్నుపోటు), అషురెడ్డి.. శివజ్యోతి (మిత్రుడు), బాబా భాస్కర్ (శత్రువు), హిమజ (వెన్నుపోటు), శ్రీముఖి.. రాహుల్ (మిత్రుడు), బాబా భాస్కర్ (శత్రువు), వితికా, పునర్నవి (వెన్నుపోటు), వరుణ్ సందేశ్.. మహేష్ (మిత్రుడు), వితికా (శత్రువు), పునర్నవి (వెన్నుపోటు), శివజ్యోతి.. అషు (మిత్రుడు), మహేష్ (శత్రువు), బాబా భాస్కర్ (వెన్నుపోటు), బాబా భాస్కర్.. శ్రీముఖి (మిత్రుడు), అలీ మహేష్ (వెన్నుపోటు). శత్రువు ఎవరూ లేరు. రవిక్రిష్ణ.. శివజ్యోతి (మిత్రుడు), అలీ (శత్రువు), వితికా (వెన్నుపోటు), అలీ రజా.. శివజ్యోతి (మిత్రుడు), రవిక్రిష్ణ (శత్రువు), హిమజ (వెన్నుపోటు) ఇలా చెప్పుకొచ్చారు. వీరు ఏవేవో కారణాలు చెప్పినా అసలు విషయం మాత్రం బిగ్ బాస్ రెండురోజుల క్రితం పెట్టిన కుంపటి తాలూకూ వీడి రాజుకోవడమే స్పష్టంగా కనిపించింది.

నాగార్జున మాస్టారి క్లాస్..

ఇక ప్రతి శనివారం నాగార్జున క్లాసు పీకడం మామూలే కదా. ఈరోజు అలీ కి, బాబా భాస్కర్ కి ఎక్కువ క్లాస్ పడింది. శివజ్యోతి చెప్పినా వినకుండా అలీ, మహేష్ తొ గొడవ పడడాన్ని తప్పు పట్టారు నాగార్జున. అది కేవలం ఆడపిల్ల కెప్టెన్ అనే అహంకారంతోనే ఆమె మాట వినలేదని చెప్పారు. అన్నిటిలోనూ మంచి మార్కులు తెచ్చుకుంటున్న అలీ.. తన అహం వీదాలనీ, అహం వీడితే జీవితంలో చాలా ఎదుగుతావనీ చెప్పారు నాగార్జున. ఇక బాబా భాస్కర్ ని మీరు అందరిలోకి పెద్దవారని గౌరవం ఇస్తున్నారు. పెద్దగా సమస్యలు వచ్చినపుడు స్పందించాలి. ఆ పని చేయడం లేదు. గొడవ ఏదైనా జరిగితే సైలెంట్ కాకూడదు. వారికి సర్ది చెప్పే బాధ్యతా తీసుకోవాలి అని చెబుతుంటే.. భాస్కర్ మధ్యలో ఎదో చేపబోయారు. బాబా..ఇది కామెడీ కాదు సీరియస్ అంటూ.. భాస్కర్కి క్లాస్ పీకారు నాగార్జున.

వాళ్ళిద్దరూ సేఫ్..

మహేష్ విట్టా, శివజ్యోతి ఈవారం సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు నాగార్జున. ఇక ఎలిమినేషన్ లో బాబా భాస్కర్, రాహుల్, హిమజ, అషు, పునర్నవి మిగిలారు. వీరిలో ఎవరు బయటకు వేల్లిపోటారో ఆదివారం ఎపిసోడ్ లో తేలనుంది.

మొత్తమ్మీద ఎపిసోడ్ మామూలుగా సాగింది. వినోదం పెద్దగా లేదు. హౌస్ ప్రశాంతంగా ఉండకూడదు అనేది బిగ్ బాస్ ధ్యేయం. పోటీ పెరగాలంటే.. శత్రుత్వం పెరగాల్సిందే. అదే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్. లీడ్ సీన్స్ లా ఉన్న ఎపిసోడ్స్ వరుసగా వస్తున్నాయి. వాటిలో ఇది కూడా చేరిపోయింది. నాగార్జున వచ్చినపుడు మరింత ఎంటర్టైన్ మెంట్ ప్రేక్షకులు ఆశిస్తారు. అది మిస్ అయిన ఫీలింగ్ కలుగుతోంది. ఇక ఈగ చచ్చిపోయిందంటూ హౌస్ మేట్స్ చేసిన హడావుడి.. డబ్బింగ్ సినిమాలో పేలని కామేదీలా ఉందంటే అతిశయోక్తి కాదు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories