Bheemla Nayak Twitter Review: భీమ్లా నాయక్ సినిమా ట్విట్టర్ రివ్యూ

Bheemla Nayak Twitter Review: భీమ్లా నాయక్ సినిమా ట్విట్టర్ రివ్యూ

Rama Rao
Updated on: 25 Feb 2022 7:04 AM IST
Bheemla Nayak Movie Twitter Review
X

 భీమ్లా నాయక్ సినిమా ట్విట్టర్ రివ్యూ

Bheemla Nayak Twitter Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్ సినిమా ఎట్టకేలకు నేడు (ఫిబ్రవరి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను తెలుగు నేటివిటీ తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసిన త్రివిక్రమ్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ అయ్యాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఇక నేడు విడుదలైన ఈ మూవీ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది.

భీమ్లా నాయక్ సినిమా మీద ముందు నుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయ్. గ్లింప్స్, పోస్టర్లతోనే సినిమా స్థాయి పెరిగింది. ఇక ఒక్కో పాట మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్ అయితే ఇంకో రేంజ్‌లో ఉంది. దీంతో సినిమా మీద అంచనాలు ఆకాశన్నంటాయి. మొత్తానికి పవర్ స్టార్ అభిమానుల ఆకలి తీర్చే బొమ్మ పడిపోయింది. ఈ సినిమాను చూసి ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు.

సినిమా చూసిన జనాలు అంతా కూడా ఒకే మాట చెబుతున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ది బెస్ ఇదేనని, నటన అదిరిపోయిందని, యాటిట్యూడ్ చూపించడంలో పవన్ కళ్యాణ్‌ను మించిన వారు లేరంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్. ఇలాంటి టాక్ విని ఎన్ని ఏళ్ల్అవుతోందో అని ఇంకో అభిమాని ట్వీట్ వేశాడు.పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అయితే వీర లెవెల్ అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు. థియేటర్లో ఫ్యాన్స్ విజిల్స్‌తో మోత మోగిస్తున్నారు.

వన్ వర్డ్‌లో చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ రానా సీన్స్, పవన్ కళ్యాణ్‌కు పెట్టిన డైలాగ్స్ అదిరిపోయాయని అంటున్నారు. మొత్తానికి భీమ్లా నాయక్ రికార్డుల వేట కొనసాగించేశాడని అర్థమవుతోంది.


Rama Rao

Rama Rao

Next Story