ఓకే సినిమాలో ఏకంగా 11 ఫైట్లు చేయనున్న బాలయ్య

Balakrishna: బాలయ్య సినిమాలో 11 ఫైట్ సన్నివేశాలు

Jyothi
Published on: 18 Nov 2022 10:07 AM IST
Balayya will do 11 Fights in One Movie
X

ఓకే సినిమాలో ఏకంగా 11 ఫైట్లు చేయనున్న బాలయ్య

Balakrishna: "అఖండ" సినిమాతో భారీ నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ మధ్యనే రవితేజ హీరోగా నటించిన "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ బాలకృష్ణ సినిమా కోసం ఒక అదిరిపోయే యాక్షన్ డ్రామా ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. "వీరసింహారెడ్డి" అనే టైటిల్ తో ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" సినిమాకి కాంపిటేషన్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో చిన్నవి పెద్దవి మొత్తం కలిపి ఏకంగా 11 ఫైట్ సన్నివేశాలు ఉండబోతున్నాయట. ఇక అందులో ఏది ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తుందో వేచి చూడాలి. ఒకవైపు సినిమా షూటింగులతో బిజీగా ఉన్న బాలకృష్ణ మరోవైపు "అన్స్టాపబుల్" అనే సెలబ్రెటీ టాక్ షో తో బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగానే దగ్గరవుతున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్, దునియా విజయ్ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story