ప్రీ రిలీజ్ బిజినెస్ తో షాక్ ఇస్తున్న బాలకృష్ణ సినిమా

Balakrishna NBK 107 Movie is Shocking with its Pre-Release Business
x

ప్రీ రిలీజ్ బిజినెస్ తో షాక్ ఇస్తున్న బాలకృష్ణ సినిమా

Highlights

ప్రీ రిలీజ్ బిజినెస్ తో షాక్ ఇస్తున్న బాలకృష్ణ సినిమా

Balakrishna Movie: వయసు పెరిగే కొద్దీ హీరోలకి ఉండే క్రేజ్ తగ్గుతూ కొందరు అంటారు. కానీ నందమూరి బాలకృష్ణ విషయంలో మాత్రం ఇది రివర్స్ అవుతుంది. ఈ మధ్యనే అన్ స్టాపబుల్ అనే టాక్ షో తో బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన నందమూరి బాలకృష్ణ "అఖండ" సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తదుపరి సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఎన్.బి.కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అప్పుడే 130 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర థియట్రికల్ రైట్స్ 70 కోట్లకు అమ్ముడు అవ్వగా నాన్ థియట్రికల్ రైట్స్ 60 కోట్ల కు అమ్ముడై రికార్డులను సృష్టించాయి. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "గాడ్ ఫాదర్" సినిమా కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోగా మరోవైపు బాలకృష్ణ సినిమాలను కొనేందుకు మాత్రం డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories