మైథాలజికల్ సినిమా చేయనున్న బాలకృష్ణ

* ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామి స్క్రిప్ట్ లో సహాయం చేసే అవకాశం కనిపిస్తుంది.

R Tripura Malini
Published on: 9 Dec 2022 9:42 AM IST
Balakrishna Is Going To Do A Mythological Movie
X

మైథాలజికల్ సినిమా చేయనున్న బాలకృష్ణ

Nandamuri Balakrishna: "అఖండ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో "వీర సింహారెడ్డి" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే సినిమా వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇది ఒక మైథాలజికల్ సినిమా అవుతుందని అంతేకాకుండా ఒక బయోపిక్ కూడా అని వార్తలు వినిపిస్తున్నాయి.

తన సినీ ప్రస్థానంలో బాలకృష్ణ మైథాలజికల్ సినిమాలలో కూడా నటించారు. పాండురంగ మహత్యం, శ్రీ రామ రాజ్యం వంటి సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా ఇప్పుడు బాలకృష్ణ స్వామి రామానుజాచార్య పాత్రలో కనిపించనున్నారు అని సమాచారం. భారతీయ హిందూ తత్వవేత్త, గురువు మరియు సంఘ సంస్కర్త అయిన రామానుజాచార్య హిందూమతంలోని శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి.

గతంలో బాలకృష్ణ నటించిన పరమవీర చక్రా, రూలర్, జై సింహ సినిమాలను నిర్మించిన సీ కళ్యాణ్ ఈ సినిమాని కూడా నిర్మించనున్నారని తెలుస్తోంది. ఇక కే రాఘవేంద్రరావు కూడా ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామి స్క్రిప్ట్ లో సహాయం చేసే అవకాశం కనిపిస్తుంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story