Balakrishna: అనిల్ రావిపూడికి బాలయ్య షాక్..

* బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయాలి కానీ పరిస్థితులు చూస్తుంటే షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యేలా లేదు

R Tripura Malini
Updated on: 6 Nov 2022 8:00 PM IST
balakrishna asked the star director to wait for two months
X

దర్శకుడు అనిల్ రావిపూడి ని రెండు నెలలు ఎదురు చూడమంటున్న బాలకృష్ణ

Nandamuri Balakrishna: ఈ మధ్యనే "అఖండ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు "వీర సింహారెడ్డి" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. "క్రాక్" సినిమాతో రవితేజ కి మంచి హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కి సిద్ధమవుతోంది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతి బరిలో దిగబోతుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం గోపీచంద్ మలినేని సినిమా పూర్తి అయిన తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయాల్సిన సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. ఇంకా "వీర సింహారెడ్డి" సినిమా కోసం నెల రోజుల పాటు పనిచేయాల్సి ఉంది.

నిజానికి నవంబర్లోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయాల్సిన సినిమా షూటింగ్ పట్టాలెక్కాలి కానీ "వీర సింహారెడ్డి" పనులతో బిజీగా ఉన్న బాలయ్య అనిల్ రావిపూడి ని వచ్చే ఏడాది జనవరి వరకు ఎదురు చూడమని చెప్పారు. ఇప్పటికే హీరోయిన్ శ్రీ లీలా డేట్లు కూడా తీసేసుకున్నారు కానీ అవి వేస్ట్ అయిపోయాయి. సినిమాలో కీలక పాత్ర పోషించనున్న ప్రియమణి డేట్ లు కూడా వేస్ట్ అయిపోయాయి. మరి ఈ సినిమా మొదలయ్యాక ముందుగా అనుకున్న వాళ్లు ఉంటారు లేక కొత్త వాళ్ళను తీసుకోవాలా అని ఇంకా చూడాల్సి ఉంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story