మొదటి రోజు కంటే రెండవ రోజు పెరిగిన అవతార్ కలెక్షన్లు

Avatar 2 Collection: రెండవ రోజు మరింత పెరిగిన అవతార్ కలెక్షన్స్

R Tripura Malini
Updated on: 18 Dec 2022 5:00 PM IST
Avatar 2 Collections Increased On Second Day Than The First Day
X

మొదటి రోజు కంటే రెండవ రోజు పెరిగిన అవతార్ కలెక్షన్లు

Avatar 2 Collection: 2009లో విడుదలై గత 13 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాలలో మొదటి స్థానం లోనే ఉన్న అవతార్ సినిమాకి సీక్వెల్ గా "అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్" ఈ మధ్యనే విడుదలైంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా స్క్రీన్ లలో విడుదలైంది. మొదటి రోజు నుంచి ఈ సినిమాకి అద్భుతమైన క్రేజ్ లభించింది. సినిమా అడ్వాన్స్ బుకింగ్లు హాట్ కేకుల్లాగా అమ్ముడయ్యాయి.

ఇప్పటిదాకా హాలీవుడ్ లో ప్రపంచవ్యాప్తంగా అన్ని సినిమాలతో పోలిస్తే హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లను అందుకొని రికార్డ్ సృష్టించిన అవతార్ 2: అవెంజర్స్ ఎండ్ గేమ్ ఓపెనింగ్ డే కలెక్షన్లను మాత్రం దాటలేకపోయింది. అయితే మొదటి రోజునే కేవలం భారత దేశంలోనే ఈ సినిమా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసుకుంది.తాజా సమాచారం ప్రకారం రెండవ రోజు సినిమా కలెక్షన్లు ఇంకా పెరిగినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఈ సినిమా 110 కోట్ల గ్రాస్ కలెక్షన్లు 88 కోట్ల నెట్ కలెక్షన్లను నమోదు చేసుకుంది. ఇక మూడవరోజు ఆదివారం కూడా కావడంతో కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఏదేమైనా అవతార్ రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తుందో లేదో వేచి చూడాలి. జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ విజువల్ వండర్ లో సామ్ వర్తింగ్ టన్, జో సల్దాన ప్రధాన పాత్రలు పోషించగా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్, క్లిఫ్ కర్టిస్, జోయెల్ డేవిడ్ మూరే, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. లైట్ స్టార్మ్ ఎంటర్టైన్మెంట్, టీజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై జేమ్స్ కామెరూన్, జోన్ లాందు సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story