అశ్వనీదత్ - మే 9 - మూడు సినిమాలు!

అశ్వనీదత్ - మే 9 - మూడు సినిమాలు!
x
aswani dutt movies released on may 9th
Highlights

సినిమా పరిశ్రమలో సెంటిమెంట్ కే అగ్రస్థానం. సినిమా టైటిల్ లో వాడే అక్షరాల దగ్గర నుంచి.. హీరో పక్కన నటించే హీరోయిన్.. ముహూర్తం షాట్ తీసేప్రదేశం.....

సినిమా పరిశ్రమలో సెంటిమెంట్ కే అగ్రస్థానం. సినిమా టైటిల్ లో వాడే అక్షరాల దగ్గర నుంచి.. హీరో పక్కన నటించే హీరోయిన్.. ముహూర్తం షాట్ తీసేప్రదేశం.. చివరికి విడుదల తేదీ ఇలా అన్నిటిలోనూ సెంటిమెంట్ ను ఎక్కువగా నమ్ముతారు. అన్నిటిలోనూ ముఖ్యంగా విడుదల తేదీ విషయంలో కొందరికి పెద్ద సెంటిమెంట్ వుంటుంది. దానికి చాలా లెక్కలూ ఉంటాయి.

అలాంటి సెంటిమెంట్ లెక్కకే కిక్కిచ్చిన విజయగాథ వైజయంతీ మూవీస్ సంస్థది! మూడు దశాబ్దాల క్రితం మే 9వ తేదీన మెగాస్టార్ చిరంజీవి.. శ్రీదేవి కాంబినేషన్ లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాను విడుదల చేసి ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసింది ఆ సంస్థ. తరువాత మళ్ళీ 2008 లో మే 9న జూనియర్ ఎన్టీఆర్ తో కంత్రీ సినిమా విడుదల చేసింది. అయితే, ఆ సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక సరిగ్గా దశాబ్దం తరువాత 2018 లో సరిగ్గా ఇదేరోజున తెలుగు తెర మీద చెరగని గుర్తు వేసిన మహానటి సావిత్రి జీవిత కథ తో 'మహానటి' సినిమాను ప్రేక్షకులకు అందించింది. ఈ సినిమా తెలుగులో వచ్చిన బయోపిక్ లలో క్లాసిక్ గా నిలిచిపోయింది. ప్రేక్షకులూ బ్రహ్మరధం పట్టారు. ఇక పోయినేడాది (2019) లో మహేష్ బాబు తో 'మహర్షి' సినిమా విడుదల చేశారు. అది కూడా సూపర్ హిట్ అయింది.

అశ్వనీదత్ నిర్మాతగా ఎన్నో సినిమాలు వైజయంతీ బ్యానర్ పై నిర్మించారు. అన్నీ దాదాపు విజయవంతమైన చిత్రాలే. కొన్ని సినిమాలు నిరాశ పరిచినా.. అశ్వనీదత్ సినిమా అంటే ప్రత్యేకంగానే ప్రేక్షకులు భావిస్తారు. నిర్మాతగా ప్రేక్షకుల్లో పెరుసంపాదిన్చుకున్న అతి తక్కువ మంది లో అశ్వనీదత్ ఒకరు. ఇక ఈయనకూ మే 9 కీ అనుబంధం ఏమిటో కానీ, ఆ రోజు రిలీజు అయిన ఈయన నిర్మించిన సినిమాలు నాలుగిటిలో మూడు చరిత్ర సృష్టించాయి.

జగదేకవీరుడు అతిలోక సుందరి

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. సోషియో ఫాంటసీ సినిమాగా.. శ్రీదేవిని దేవకన్యగా చూపిస్తూ రాఘవేంద్రరావు చేసిన మాయాజాలానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. నిజానికి ఈ సినిమా విడుదల సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. సరిగ్గా సినిమా విడుదలకు రెండురోజుల ముందు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు జిల్లాలు అతలాకుతలం అయిపోయాయి. మరిన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో తల్లడిల్లిపోయాయి. ఈ సమయంలో ఈ సినిమా విడుదల అవుతోందంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా కొంత కంగారు పడ్డారు. కానీ, అంతటి విపత్కర పరిస్థితిలోనూ ప్రేక్షకులు జగదేక వీరునిగా చిరంజీవికి జై కొట్టారు. కొత్తదనంతో నిండిన కథనం.. మనసును మరోలోకంలోకి తీసుకువెళ్లి పోయిన ఇళయరాజా సంగీతం.. చిరంజీవి..శ్రీదేవి నువ్వా నేనా అన్నట్టు చేసిన సీన్లు.. వాటికి మించిన డ్యాన్సులు.. మానవా అంటూ శ్రీదేవితో జంధ్యాల పలికించిన పలుకులు.. అమ్రిష్ పూరి మాంత్రికుడిగా పలికించిన హావభావాలు.. ఇలా ఒకటనేమిటి సినిమాలో ప్రతి అంశం ప్రేక్షకులను అలరించింది. తుపాను వర్షాలతో పోటీగా వసూళ్ళ వర్షం కురిసింది.

కంత్రి..

మెహర్ రమేష్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఅర్ తో తీసిన సినిమా ఇది. రిచ్ గా సినిమా తీశారు. ఎన్టీఅర్ కొత్తగా కనిపిస్తారు. మెహర్ రమేష్ దర్శకత్వ ప్రతిభా బానే ఉంటుంది. కానీ, సినిమాలోని కొన్ని అంశాలను ప్రేక్షకులు ఆదరించలేదు. దాంతో సినిమా సో సో గా మిగిలిపోయింది.

మహానటి..

తెలుగు తెరపై సావిత్రి ముద్ర చెరిగిపోనిది. ఆమె జీవిత ప్రయాణం చాలా మందికి సరిగా తెలీదు. ఒక మామూలు సావిత్రి మహానటిగా ఎదిగిన ప్రస్థానం.. ఆ ప్రయాణంలో ఆమె పడిన కష్టం.. తన బోళా తనంతో జీవితంలో కోల్పోయిన సంతోషం.. అన్నిటినీ ఏర్చి కూర్చి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ కుమార్తెలు నిర్మించిన చిత్రం ఇది. మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ నటన తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలను తడిపేసింది. సావిత్రికి ప్రేక్షకులందరూ మరోసారి ఘన నీరాజనం ఇచ్చారు.

మహర్షి..

మహేష్ బాబు సినిమా అంటే ఉండే అంచనాలు తప్పకుండా.. సామాజిక సందేశాన్ని ఇముడుస్తూ సినిమా తీయడం మామూలు విషయం కాదు. సరిగ్గా ఆపనిని దిగ్విజయంగా చేసింది వైజయంతీ బ్యానర్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రైతన్నలకు వెన్నుదన్నుగా ఉండే సందేశంతో కమర్శియాలిటీ దెబ్బతినకుండా... రియాల్టీని సెల్యులాయిడ్ మీద ఆవిష్కరించిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

మొత్తమ్మీద అశ్వనీదత్ కీ మే 9 వ తేదీకి అవినాభావ సంబంధం ఉంది. ఏది ఏమైనా ఈరోజు విడుదలైన ఆయన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడం విశేషం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories