నా అకౌంట్ నా ఇష్టం.. అనసూయ

నా అకౌంట్ నా ఇష్టం.. అనసూయ
x
Highlights

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సెలబ్రిటీల్లో జబర్దస్త్ అనసూయ భరద్వాజ్ ఒకరు. ఎక్కువగా ట్విట్టర్ లో తన అభిప్రాయాలతో విరుచుకుపడుతుంటారు. అలాగే ఆమె ట్వీట్...

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సెలబ్రిటీల్లో జబర్దస్త్ అనసూయ భరద్వాజ్ ఒకరు. ఎక్కువగా ట్విట్టర్ లో తన అభిప్రాయాలతో విరుచుకుపడుతుంటారు. అలాగే ఆమె ట్వీట్ చేస్తే వందలాది మంది రెస్పాండ్ అవుతారు. అందులో ఆమె అభిమానులే కాకుండా.. ఆమెను వ్యతిరేకించే వారూ ఉంటారు. అయితే ఆమెను వ్యతిరేకిస్తూ కామెంట్లు పెట్టే వారిని తన ఎకౌంట్ నుంచి బ్లాక్ చేస్తున్ననంటూ అనసూయ ఓ ట్వీట్ చేశారు. 'వితండవాదానికి నా అకౌంట్(ట్విట్టర్) పేజీలో స్థానం లేదు. నా ట్విట్టర్ హ్యాండిల్ లో దురుద్దేశంతో అనుచిత కామెంట్లు చేస్తున్నవారందరినీ బ్లాక్ చేస్తున్నా. ఇది నా అకౌంట్. నేను ప్రశాంతంగా ఉండటానికి ఏది కావాలనుకుంటే అది చేసే హక్కు నాకు ఉంది' అంటూ ఆమె చేసిన ట్వీట్ దుమారమే రేపుతోంది.

చాలా మంది ఈ ట్వీట్ పట్ల తమ నిరసన వ్యక్తం చేస్తూ ఆమెకు జవాబిస్తున్నారు. మీరు మాట్లాడితే వేదాంతం మేము మాట్లాడితే వితందవాదమూనా అంటూ విరుచుకు పడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories