Allu Sirish: అను ఇమాన్యుల్ తో అనుబంధం గురించి చెబుతున్న అల్లు శిరీష్

Allu Sirish: మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు" అంటున్న అల్లు హీరో

Jyothi
Published on: 20 Oct 2022 11:14 AM IST
Allu Sirish Talking About His Relationship With Anu Emmanuel
X

Allu Sirish: అను ఇమాన్యుల్ తో అనుబంధం గురించి చెబుతున్న అల్లు శిరీష్

Allu Sirish: "ఏబిసిడి: అమెరికన్ రిటర్న్ కన్ఫ్యూజ్డ్ దేసి" అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న అల్లు శిరీష్ కొన్ని నెలలపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత మళ్ళీ "ఊర్వశివో రాక్షసివో" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. విజేత ఫేమ్ రాకేష్ శశి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4 న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన హీరోయిన్ అను ఇమాన్యుల్ తో తానుడేటింగ్ లో ఉన్నాడంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు అల్లు శిరీష్.

ఈ మధ్యనే విడుదలైన చిత్ర టీజర్ లో వీరిద్దరి మధ్య ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు మరియు కెమిస్ట్రీ చూసి ఈ పుకార్లు మొదలయ్యాయి. దీని గురించి మాట్లాడుతూ, "ఇలాంటి వివాదాలు చాలా సాధారణం. కో స్టార్ తో ప్రేమలో ఉన్నానని వార్తలు రావడం సహజం. గతంలో కూడా నా గురించి ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ నిజానికి మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు. మేము మంచి స్నేహితులం మాత్రమే. కొన్ని నెలలు కలిసి పని చేసాం కాబట్టి మా మధ్య కొంత అనుబంధం ఉంది. పైగా తను చాలా సైలెంట్ అమ్మాయి. మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయి. తను చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు అందుకే ఇబ్బంది పడలేదు. ఇలాంటి తప్పుడు పుకార్లకి దూరంగా ఉండాలని సోషల్ మీడియా కి కూడా దూరమయ్యాను," అని స్పష్టం చేశారు అల్లు శిరీష్.

Jyothi

Jyothi

Next Story