logo
సినిమా

రన్వీర్ సింగ్ సినిమా పై కన్నేసిన మెగా కాంపౌండ్

రన్వీర్ సింగ్ సినిమా పై కన్నేసిన మెగా కాంపౌండ్
X
Highlights

రన్బీర్ సింగ్, అలియాభట్ హీరోహీరోయిన్లుగా జోయ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన గల్లీ బాయ్ సినిమా ప్రేమికుల...

రన్బీర్ సింగ్, అలియాభట్ హీరోహీరోయిన్లుగా జోయ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన గల్లీ బాయ్ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైంది. విడుదలకు ముందు నుంచి మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో రన్వీర్ సింగ్ ఒక రాపర్ గా కనిపించాడు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పించడంతో సినిమా మంచి టాక్ తో బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా విడుదలైన రెండు రోజులకే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను ప్రయత్నాలు మొదలుపెట్టారట. అయితే అల్లు అరవింద్ మాత్రమే కాక చాలా మంది తెలుగు నిర్మాతలు ఈ సినిమా ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి కాంపిటేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ అల్లు అరవింద్ కు గనుక. ఈ ప్రాజెక్టు అందితే మెగా హీరోలలో ఒకరు ఈ సినిమాలో హీరోగా నటిస్తారు. స్క్రిప్ట్ పనులు పూర్తయితే అప్పుడు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ లేదా వైష్ణవ తేజ్ ఈ నలుగురిలో ఎవరో ఒకరు హీరోగా ఈ సినిమాలో నటిస్తారని ప్రచారం సాగుతోంది.

Next Story